Cyber Crime: క్రెడిట్ కార్డుపై రివార్డ్‌ పాయింట్స్‌ అంటూ మెస్సెజ్.. లింకు ఒపెన్ చేయగానే ఏమైందంంటే?

|

Dec 27, 2021 | 8:08 AM

Hyderabad Cyber Crime: దేశంలో సైబర్ మోసాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. సైబర్ నేరస్థులు

Cyber Crime: క్రెడిట్ కార్డుపై రివార్డ్‌ పాయింట్స్‌ అంటూ మెస్సెజ్.. లింకు ఒపెన్ చేయగానే ఏమైందంంటే?
Cyber Crime
Follow us on

Hyderabad Cyber Crime: దేశంలో సైబర్ మోసాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. సైబర్ నేరస్థులు రోజుకో విధంగా రెచ్చిపోతూనే ఉన్నారు. బహుమతులు, రివార్డులు, ఉద్యోగాలు అంటూ నేరస్థులు అమాయకులను మాయచేస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లో మరో మోసం వెలుగులోకి వచ్చింది. క్రెడిట్ కార్డుపై రివార్డ్ పాయింట్స్ పేరుతో నేరస్థులు పెద్ద మొత్తంలో నగదు కాజేశారు. మెసేజ్‌ రూపంలో లింక్‌ పంపించిన సైబర్ నేరస్థులు లక్షకుపైగా నగదు మాయం చేశారు. దీంతో బాధితుడు లబోదిబోమంటూ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది.

పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌ బాలానగర్‌ పరిధిలోని ఐడీపీఎల్‌కు చెందిన సుభాష్‌ అనే వ్యక్తికి కొటక్ మహీంద్రా బ్యాంకు క్రెడిట్‌ కార్డు ఉంది. కొంతకాలం నుంచి అతను ఆ కార్డును వినియోగిస్తున్నాడు. అయితే.. ఆ క్రెడిట్ కార్డుకు రివార్డ్‌ పాయింట్స్‌ వచ్చాయంటూ.. గుర్తు తెలియని వ్యక్తులు సుభాష్ కు మెసేజ్‌ రూపంలో లింక్‌ పంపించారు. అది నమ్మిన సుభాష్‌ తన ఖాతాకు సంబంధించిన వివరాలను నేరస్థులకు తెలిపాడు. దీంతో వెంటనే అతని ఖాతా నుంచి రూ.1.11లక్షలు డెబిట్‌ అయినట్టు మెసేజ్‌ వచ్చింది.

వెంటనే కంగుతున్న బాధితుడు బాలానగర్‌ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సైబర్‌ నేరగాళ్లు క్రెడిట్ కార్డుపై రివార్డులు పేరిట మోసానికి పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు. అయితే.. ఇలాంటి మెస్సెజ్‌లకు రిప్లే ఇవ్వొద్దని.. సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ప్రజలకు సూచిస్తున్నారు.

Also Read:

Cyber cirme: బ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నాం అంటే జాగ్రత్త.. ఎందుకంటే..

Train Fire Breaks: కాస్‌గంజ్‌ ప్యాసింజర్‌ రైలులో మంటలు.. మూడు బోగీలు అగ్నికి ఆహుతి..!