Telangana: రాష్ట్రంలో వరుస రోడ్డు ప్రమాదాలు..చిన్నారి మృతి.. పలువురికి గాయాలు..

|

Mar 29, 2022 | 9:34 AM

రాష్ట్రంలోని రహదారులు మృత్యుపాశాలుగా మారుతున్నాయి. రోడ్లు బాగోలేకపోవడం, డ్రైవర్ల నిర్లక్ష్యం కారణంగా ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి.

Telangana: రాష్ట్రంలో వరుస రోడ్డు ప్రమాదాలు..చిన్నారి మృతి.. పలువురికి గాయాలు..
Road Accidents
Follow us on

రాష్ట్రంలోని రహదారులు మృత్యుపాశాలుగా మారుతున్నాయి. రోడ్లు బాగోలేకపోవడం, డ్రైవర్ల నిర్లక్ష్యం కారణంగా ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. తాజాగా యాదాద్రి భువ‌న‌గిరి జిల్లా రామ‌న్నపేట మండ‌లం దుబ్బాక వ‌ద్ద మంగ‌ళ‌వారం ఉద‌యం ఘోర రోడ్డు ప్రమాదం సంభ‌వించింది. వేగంగా వెళ్తున్న కారు అదుపుత‌ప్పి బోల్తా ప‌డింది. దీంతో కారులో ప్రయాణిస్తోన్న చిన్నారి అక్కడికక్కడే కన్నుమూసింది. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని స‌హాయ‌క చర్యలు చేపట్టారు. చిన్నారి మృత‌దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం రామ‌న్నపేట ఏరియా ఆస్పత్రికి త‌ర‌లించారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

గేదెను తప్పించబోయి..

గేదెను తప్పించబోయి ఓ ఆర్టీసీ బస్సు ప్రమాదవశాత్తూ చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో గేదె మృతి చెందగా.. పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. మహబూబాబాద్ మండలం కంబాలపల్లి శివారులో ఈ ఘటన చోటుచేసుకుంది. కామారెడ్డి డిపోకు చెందిన బస్సు కామారెడ్డి నుండి భద్రాచలం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సు ఢీకొనడంతో గేదె అక్కడికక్కడే మృతి చెందింది. కాగా ఈ ప్రమాదంలో 13 మంది ప్రయాణికులకు స్వల్పంగా గాయాలైనట్లు అధికారులు తెలిపారు.