అమానుష ఘటన.. కరోనా బాధితురాలిపై అంబులైన్స్ డ్రైవర్ అత్యాచారం

| Edited By:

Sep 06, 2020 | 5:42 PM

కేరళలో అమానుష ఘటన చోటు చేసుకుంది. కరోనా బారిన పడ్డ యువతిని ఆసుపత్రికి తీసుకెళ్తూ.. మార్గమధ్యలో ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు

అమానుష ఘటన.. కరోనా బాధితురాలిపై అంబులైన్స్ డ్రైవర్ అత్యాచారం
Follow us on

Corona Patient raped: కేరళలో అమానుష ఘటన చోటు చేసుకుంది. కరోనా బారిన పడ్డ యువతిని ఆసుపత్రికి తీసుకెళ్తూ.. మార్గమధ్యలో ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు అంబులెన్స్ డ్రైవర్. ఆ తరువాత ఆమెను ఐసోలేషన్ కేంద్రంలో వదిలేసి అక్కడి నుంచి పరారయ్యాడు. శనివారం అర్ధరాత్రి జరిగిన సంఘటన.. కేరళలో సంచలనంగా మారింది.

వివరాల్లోకి వెళ్తే.. తిరువనంతపురానికి 100కి.మీల దూరంలో ఉన్న పఠనమిట్ట ప్రాంతంలో ఓ 19ఏళ్ల యువతికి పాజిటివ్‌ రావడంతో, ఆమెకు క్వారంటైన్‌ సెంటర్‌కి తరలించేందుకు బంధువులు అంబులెన్స్‌కి కాల్‌ చేశారు. ఈ క్రమంలో నౌఫాల్ అనే డ్రైవర్‌ 108 అంబులెన్స్‌కి తీసుకొని అక్కడకు వెళ్లాడు. అయితే అప్పటికే ఓ వృద్ధురాలిని కూడా క్వారంటైన్ సెంటర్‌కి తీసుకెళ్లాల్సి వచ్చింది. ఆ ఇద్దరిని వేర్వేరు చోట్లకు తీసుకెళ్లాల్సి రావడంతో.. మొదట వృద్ధురాలిని ఒక క్వారంటైన్ సెంటర్‌లో వదిలి వచ్చాడు. ఆ తరువాత యువతిని పండాలమ్ ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు బయల్దేరాడు. ఈ క్రమంలో మధ్యలో అంబులెన్స్‌ని ఖాళీ ప్రదేశానికి తీసుకెళ్లి, ఆ యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ తరువాత ఆమెను కరోనా సంరక్షణ కేంద్రంలో వదిలేశాడు. అక్కడ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అరన్ములా పోలీసులు ఆ డ్రైవర్‌ని అరెస్ట్‌ చేశారు. గతంలోనూ అతడు పలు క్రిమినల్ కేసుల్లో భాగం అయ్యాడని పోలీసులు తెలిపారు.

మరోవైపు ఈ ఘటనపై కేరళ ఆరోగ్యశాఖ మంత్రి కెకె శైలజా దిగ్ర్భాంతిని వ్యక్తం చేశారు. డ్రైవర్‌ని వెంటనే విధుల నుంచి తొలగించాలని జీవీకే సంస్థకు సూచించారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని పోలీసులు ఆదేశించారు. ప్రస్తుతం అతడిని క్వారంటైన్‌లో ఉంచగా.. వర్చువల్ మోడ్‌ ద్వారా పోలీసులు అతడిని కోర్టు ముందు హాజరుపర్చనున్నారు.

Read More:

రాజమౌళికి ఎన్టీఆర్ ఫ్యాన్స్ డిమాండ్‌.. ఏంటంటే

అర్జున్‌ కపూర్‌కి కరోనా పాజిటివ్‌‌.. మలైకాకి కూడానా!