నల్లకోళ్లు.. నిమ్మకాయలు. నిర్మానుష్య ప్రదేశం.. చెరువు పక్కన చెట్లతో నిండిపోయింది ఆ ప్రాంతం. అక్కడికి ఎవరూ రారు అనుకున్నారు వారు. కాని ఏదో చేద్దామనుకుంటే ఏదో అయినట్లు వారి బండారం బయటపడింది. క్షుద్రపూజల చేస్తున్నట్లు తెలియడంతో అక్కడకు చేరుకున్న స్థానికులు వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలంలో క్షుద్ర పూజలు చేతబడి కలకలం సృష్టించింది. రాజారామ్ నగర్ స్మశానవాటికలో అర్ధరాత్రి దంపతులు పూజలు నిర్వహిస్తూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. స్మశాన వాటిక నుంచి శబ్ధాలు రావడంతో గమనించిన స్థానికులు.. వారిని పట్టుకొని విచారించగా.. క్షుద్రపూజలు చేసినట్లు తేలింది.
వీరిని స్థానికంగా ఓ ఫైల్స్ క్లీనిక్ నిర్వహించే సమీరా రాయ్ అతడి భార్య సిఫ్రా రాయ్‌గా గుర్తించారు. భార్యాభర్తలిద్దరూ నాలుగు నెలలుగా క్షుద్ర పూజలు నిర్వహిస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. శ్మశానవాటిలో క్షుద్ర పూజలు జరిగినట్లు తెలియడంతో స్థానికులు భయందోళన వ్యక్తం చేస్తున్నారు.