Couple Suicide: కరోనా ఎఫెక్ట్‌తో అప్పుల బాధను తాళలేక ఆత్మహత్య చేసుకున్న ఓ ప్రైవేట్‌స్కూల్ యాజమాన్య దంపతులు

|

Aug 16, 2021 | 6:59 AM

Couple Suicide: మనిషి జీవితం కరోనాకి ముందు కరోనా తర్వాత అన్నచందంగా మారిపోయింది. కోవిడ్ ఎఫెక్ట్ శారీరక ఆరోగ్యంపైనే కాదు.. ఆర్ధిక, సామాజిక పరిస్థితులపై కూడా తీవ్ర ప్రభావం..

Couple Suicide: కరోనా ఎఫెక్ట్‌తో అప్పుల బాధను తాళలేక ఆత్మహత్య చేసుకున్న ఓ ప్రైవేట్‌స్కూల్ యాజమాన్య దంపతులు
Couple Sucide
Follow us on

Couple Suicide: మనిషి జీవితం కరోనాకి ముందు కరోనా తర్వాత అన్నచందంగా మారిపోయింది. కోవిడ్ ఎఫెక్ట్ శారీరక ఆరోగ్యంపైనే కాదు.. ఆర్ధిక, సామాజిక పరిస్థితులపై కూడా తీవ్ర ప్రభావం చూపించింది. బండ్లు ఓడలు ఓడలు బండ్లు ఐన చందంగా పరిస్థితి మారిపోయింది. కరోనా ఎఫెక్ట్ తో అప్పుల బాధను తాళలేక ఓ ప్రైవేట్ స్కూల్ యాజమాన్య దంపతులు బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారు. ఈ దారుణ ఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

కోవెలకుంట్ల పట్టణానికి చెందిన లైఫ్ ఎనర్జీ స్కూల్ యజమాని కర్నాటి సుబ్రహ్మణ్యం, అతని భార్య రోహిణి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. వడ్డీ వ్యాపారుల చేస్తున్న తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నామని ఆ దంపతులు సెల్ఫీ వీడియోలో చెప్పారు. ఆత్మహత్య చేసుకోవడానికి ముందు సుబ్రహ్మణ్యం, రోహిణి దంపతులు ఇంటి నుంచి కారు నడుపుకుంటూ .. వెళ్తూ.. సెల్ఫీ వీడియో తీసినట్లు తెలుస్తోంది. ఓ వైపు ఫీజులు వసూలు కావడం లేదని.. మరోవైపు అప్పు ఇచ్చిన వారి బాధలు తాళలేక ఆత్మహత్య చేసుకుంటున్నామని తెలిపారు. అంతేకాదు.. తమ మరణానికి అప్పు ఇచ్చిన సుమన్ సింగ్, సునీల్ కుమార్ లు కారణమని.. వారిద్దరూ తమని ఎన్నో అవమానాలకు గురి చేశారని ఆరోపించారు.

కరోనా వెలుగులోకి వచ్చినప్పటి నుంచి స్కూల్స్ సరిగా జరిగింది లేదు.. దీంతో ఫీజులు కట్టేవారు తక్కువయ్యారు.. ఇక తీసుకున్న అప్పులకు వడ్డీలు కట్టలేకపోతున్నాం.. అప్పు ఇచ్చిన వారు చేస్తున్న ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నామని స్కూల్ యజమాని సుబ్రహ్మణ్యం తెలిపారు. కారులో ప్రయాణించిన ఈ దంపతులు ఆత్మకూరు సమీపంలోని కరివేమ లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ దంపతులు ఆత్మహత్యతో కర్నూలు జిల్లా ఒక్కసారిగా ఉల్కిపడింది. అంతేకాదు కర్నూలు జిల్లా విద్యా రంగం లోనే కలకలం సృష్టించింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Also Read:  గంగా స్నానం.. గంగలో అస్థికలు కలపడానికి గల పరమార్ధాన్ని భీముడికి చెప్పిన భీష్ముడు