చనిపోయినవాళ్లూ లోన్లు తీసుకున్నారు.. కోటీ రెండు కోట్లు కాదు.. ఏకంగా 23 కోట్ల.. ఎక్కడో కాదు..!

|

Feb 23, 2021 | 9:20 PM

చనిపోయినవాళ్లూ లోన్లు తీసుకున్నారు. ఎవరో తినేసిన సొమ్మును తిరిగి కట్టమని నోటీసులొస్తుంటే తెల్లమొహాలేస్తున్నారు. సహకారరంగంలో స్వాహాపర్వాన్ని కళ్లకుగట్టే స్కామ్‌ ఇది.

చనిపోయినవాళ్లూ లోన్లు తీసుకున్నారు.. కోటీ రెండు కోట్లు కాదు.. ఏకంగా 23 కోట్ల.. ఎక్కడో కాదు..!
Co-operative Bank Loan Scam
Follow us on

Loan Scam in Jaggampet: చనిపోయినవాళ్లూ లోన్లు తీసుకున్నారు. ఎవరో తినేసిన సొమ్మును తిరిగి కట్టమని నోటీసులొస్తుంటే తెల్లమొహాలేస్తున్నారు. సహకారరంగంలో స్వాహాపర్వాన్ని కళ్లకుగట్టే స్కామ్‌ ఇది. పేర్లు మాత్రమే వాళ్లవి. లోన్లు తీసుకుంది ఎవరో తెలీదు. అప్పు చెల్లించాలని నోటీసులొస్తుంటే…మేం ఎక్కడ తీసుకున్నామంటూ సొసైటీకి క్యూ కడుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలోని గండేపల్లి సొసైటీలో భారీ గోల్‌మాల్‌ ఆలస్యంగా వెలుగుచూసింది.

కోటీ రెండు కోట్లు కాదు..ఏకంగా 23 కోట్ల 85 లక్షలు. 2017 -2019 మధ్య జరిగిందీ కుంభకోణం. తొండంగి, రౌతలపూడి, శంఖవరం, ప్రత్తిపాడు మండలాల పరిధిలో ఈ అక్రమాలకు తెరలేచింది. డాక్యుమెంట్స్‌ డూప్లికేట్‌. చివరికి సబ్‌రిజిస్ట్రార్‌ సంతకం కూడా ఫోర్జరీనే.

చనిపోయిన వారిని కూడా వదల్లేదు అక్రమార్కులు. పదేళ్లక్రితం చనిపోయినవారి పేర్లమీద కూడా లోన్లు సృష్టించారు. ఈ లోకంలో లేనివారికి కూడా నోటీసులు రావడంతో బాధితులు నెత్తీనోరు బాదుకుంటున్నారు. తొండంగి మండలంలోని 61 మందికి అప్పులు తీర్చాలంటూ నోటీసులొచ్చాయి. వారంతా దాదాపు 10కోట్ల 73 లక్షల రుణాలు తీసుకున్నట్లు లెక్కలున్నాయి.

ఎక్కడో జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్న గండేపల్లి సహకారబ్యాంక్‌కి, తొండంగి రైతులకు సంబంధమే లేదు. అయినా సొసైటీ నుంచి అప్పు ఎప్పుడు చెల్లిస్తారంటూ ఫోన్లు. త్వరగా కట్టకపోతే చర్యలుంటాయంటూ నోటీసులు. దీంతో అసలు ఆ పేర్లపై ఎప్పుడూ లోన్లే తీసుకోలేదంటూ తమ దగ్గరే ఉన్న పాస్‌పుస్తకాలు చూపిస్తున్నారు కుటుంబసభ్యులు.

దాదాపు 60మంది రైతుల పేరిట దొంగ పాస్‌బుక్కులు సృష్టించి లోన్లు దిగమింగినట్లు అనుమానిస్తున్నారు. టీడీపీ హయాంలో జరిగిన ఈ భారీ స్కాంలో సొసైటీ ఉద్యోగులతో పాటు కొందరు నేతల ప్రమేయం ఉందని అనుమానిస్తున్నారు. లక్ష రూపాయల లోన్‌కే సవాలక్ష ప్రశ్నలేసే అధికారులు…గుడ్డిగా ఇన్ని కోట్ల రుణాలు ఎలా ఇచ్చారన్నదే మిలియన్‌ డాలర్ట ప్రశ్న.

ఇవి కూడా చదవండి

Antarvedi Rathodsavam: జన సంధ్రమైన అంతర్వేది.. వైభవంగా శ్రీ లక్ష్మీనృసింహ స్వామి రథోత్సవం

‘El Chapo’ Wife Arrested: ట్రంప్ పోరాటాన్ని కొనసాగిస్తున్న బైడెన్.. అంతర్జాతీయంగా డ్రగ్ మాఫియా డాన్ భార్య అరెస్ట్..