డిగ్రీ విద్యార్థిని అనూష హత్యపై సీఎం ఆగ్రహం, పదిలక్షల ఆర్థిక సాయం, నేరాన్ని నిరూపించి కఠిన శిక్షణ పడేలా చర్యలకు ఆదేశం

గుంటూరు జిల్లా నరసరావుపేటలో డిగ్రీ విద్యార్థిని అనూష హత్యపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. సీఎంఓ అధికారులను అడిగి ఘటనకు సంబంధించిన..

  • Venkata Narayana
  • Publish Date - 8:57 am, Thu, 25 February 21
డిగ్రీ విద్యార్థిని అనూష హత్యపై సీఎం ఆగ్రహం, పదిలక్షల ఆర్థిక సాయం,  నేరాన్ని నిరూపించి కఠిన శిక్షణ పడేలా చర్యలకు ఆదేశం

గుంటూరు జిల్లా నరసరావుపేటలో డిగ్రీ విద్యార్థిని అనూష హత్యపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. సీఎంఓ అధికారులను అడిగి ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్న ఆయన, ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని చెప్పారు. కేసులో నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనూషను హత్య చేసిన విష్ణువర్ధన్ రెడ్డిపై దిశ చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ వేగంగా జరిగేలా చూడాలని, నేరాన్ని నిరూపించి కఠిన శిక్షణ పడేలా చర్యలు తీసుకోవాలని జగన్ అన్నారు. ప్రేమోన్మాది ఘాతుకానికి బలైన అనూష కుటుంబానికి ఏపీ ప్రభుత్వం తరపున రూ.10లక్షల ఆర్ధిక సాయం ప్రకటించారు జగన్. వీలైనంత త్వరగా సాయం అందించి కుటుంబానికి భరోసా కల్పించాలన్నారు. కాగా, అనూష హత్యపై నరసరావుపేటలో విద్యార్థి సంఘాలు, ఆమె కుటుంబ సభ్యులు రెండో రోజుకూడా ఆందోళన చేస్తున్నారు. నిన్న మృతదేహంతో ర్యాలీ నిర్వహించిన విద్యార్థులు, బంధువులు న్యాయం చేయాలంటూ ధర్నాకు దిగిన సంగతి తెలిసిందే. దీంతో నరసరావుపేటలో టెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసులు నచ్చజెప్పినా ఆందోళనకారులు శాంతించలేదు.

కాగా, గుంటూరుజిల్లా నరసరావుపేటలోని స్థానిక కృష్ణవేణి ప్రైవేట్ కాలేజ్ లో డిగ్రీ చదువుతున్న అనూష నిన్న దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. అనూషను హత్య చేసి మృతదేహాన్ని కాలువలో పడేశాడు తోటి విద్యార్థి విష్ణువర్థన్ రెడ్డి. అనూషది ముప్పాళ్ల మండలం గోళ్లపాడు గ్రామం కాగా, అనూషను పొట్టనబెట్టుకున్న విష్ణువర్ధన్ రెడ్డిది బొల్లాపల్లి మండలం పమిడిపాడు. గత కొంతకాలంగా నిందితుడు విష్ణువర్థన్ రెడ్డి బాధితురాలు అనూషను ప్రేమపేరుతో వేధిస్తున్నట్టు తెలుస్తోంది. అనూష మరొకరితో అనూష చనువుగా ఉంటుందన్న అనుమానంతో, పైకి మాయమాటలు చెప్పి నిర్మానుష ప్రాంతానికి తీసుకెళ్ళిన విష్ణువర్థన్ రెడ్డి.. అనూషను గొంతు నులిమి చంపేశాడు. అనంతరం విష్ణువర్ధన్ రెడ్డి మృతదేహాన్ని పాలపాడు సమీపంలోని కాలువలో పడేశాడు. హత్య అనంతరం నిందితుడు విష్ణువర్థన్ రెడ్డి నరసరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఏమైతే ఏమి, కర్మభూమిలో మరో పువ్వు రాలింది. ఓ ఉన్మాది చేతిలో చిదిగిపోయింది. ఓ కుటుంబానికి తీరని శోకం మిగిల్చింది. ప్రేమున్న చోట అనుమానం ఉంటుందా… కానీ ఇంతలేడు కాని వాడి ఒంటి నిండా అనుమానపు బీజాలే. ఆ యువతి అతని సొంతమైనట్టు..ఆమెకు ఆమె జీవితం పట్ల ఎలాంటి రైట్స్‌ లేనట్లు…ఎవ్వరితోనైనా మాట్లాడుతూ పాపం ఆ యువతి కనిపిస్తే..ఇక అంతేనట. ఇలాంటోడు ప్రేమికుడవతాడా.., రాక్షసుడవతాడు కానీ..అందుకే పైకి ప్రేమ నటిస్తూ..లోపల ధ్వేషం పెంచుకుని..చివరికి కసిదీరా ఆ అమాయకురాలని అంతం చేశాడు.

Read also :

ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటుపరంపై ప్రధాని మోదీ స్పష్టమైన ప్రకటన నేపథ్యంలో విశాఖ స్టీల్ ఉద్యమంలో ఇప్పుడేం జరగబోతోంది..?