Crime News: లిప్టు పేరుతో మైనర్ బాలిక కిడ్నాప్.. పార్క్‌లోకి తీసుకెళ్లి అఘాయిత్యం.. ఢిల్లీ సివిల్ డిఫెన్స్ ఉద్యోగి అరెస్ట్!

|

Nov 22, 2021 | 9:03 PM

దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణం వెలుగు చూసింది. బిందాపూర్ ప్రాంతంలో మైనర్‌ను కిడ్నాప్ చేసి అత్యాచారం చేసినందుకు 20 ఏళ్ల సివిల్ డిఫెన్స్ సిబ్బందిని పోలీసులు అరెస్టు చేశారు.

Crime News: లిప్టు పేరుతో మైనర్ బాలిక కిడ్నాప్.. పార్క్‌లోకి తీసుకెళ్లి అఘాయిత్యం.. ఢిల్లీ సివిల్ డిఫెన్స్ ఉద్యోగి అరెస్ట్!
Follow us on

Delhi Minor Girl Raped: దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణం వెలుగు చూసింది. బిందాపూర్ ప్రాంతంలో మైనర్‌ను కిడ్నాప్ చేసి అత్యాచారం చేసినందుకు 20 ఏళ్ల సివిల్ డిఫెన్స్ సిబ్బందిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని ఉత్తమ్‌నగర్‌కు చెందిన అభిషేక్‌ కుమార్‌గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. మైనర్ బాధితురాలి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. బాధితురాలు గత బుధవారం ఇంటి నుంచి కోచింగ్ సెంటర్‌కు వచ్చి, తిరిగి వెళ్లేందుకు మటియాలా రోడ్డులో వేచి ఉంది. అదే సమయంలో అటుగా మోటార్‌సైకిల్‌పై వచ్చిన యువకుడు ఇంటి దగ్గర దింపే నెపంతో తీసుకెళ్లాడని కుటుంబ సభ్యులకు చెప్పినట్లు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.

నిందితులు బాధితురాలిని కోచింగ్ సెంటర్‌కు తీసుకెళ్లి పోలీసుగా పరిచయం చేసుకున్నాడు. ఆ తర్వాత ఆమెను ఓ పార్కుకు తీసుకెళ్లాడు. అక్కడ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసు అధికారి తెలిపారు. బాలిక కుటుంసభ్యులు ఇచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు. విచారణలో, పోలీసులు మటియాలా, జైన్ కాలనీ, రాజపురిలో అమర్చిన 150కి పైగా సీసీ కెమెరాల ఫుటేజీని స్కాన్ చేశారు. ఒక ఫుటేజీలో, ఆమె మోటారుసైకిల్‌పై వెళుతున్నట్లు కనిపించింది. ఈ ఆధారంతో నిందితుడిని గుర్తించి శనివారం రాజపురి ప్రాంతం నుండి అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఇదిలావుంటే, నార్త్ ఈస్ట్ ఢిల్లీలోని నంద్ నగ్రి ప్రాంతంలో ఒక ప్రైవేట్ క్యాబ్‌లో కత్తితో మహిళను దోచుకున్నందుకు ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. నవంబర్ 7న నిందితులు ఒకే క్యాబ్‌లో ప్రయాణిస్తుండగా ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. నిందితులు మహిళ నుంచి రెండు మొబైల్ ఫోన్లు, రూ.10 వేల నగదు, బంగారు గొలుసు, రెండు బంగారు ఉంగరాలు దోచుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. విచారణలో పింటూ బిలాల్, నూర్ ఇస్లాం, షేక్ రఫీక్‌లను పోలీసులు శుక్రవారం అరెస్టు చేసినట్లు సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఫిర్యాదుదారుడి బంగారు గొలుసు, ఉంగరం, రెండు మొబైల్ ఫోన్లు, సిమ్‌కార్డును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. దోపిడీ చేసిన అనంతరం ముగ్గురు కలిసి సీమాపురికి చెందిన సగీర్‌కు బంగారు ఉంగరాన్ని విక్రయించారు. అతడిని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయన్నారు.

Read Also….  Kisan Mahapanchayat: వ్యవసాయ చట్టాలు రద్దు చేసే వరకు రైతుల ఉద్యమం కొనసాగుతుందిః రాకేష్ టికైత్