YCP Councillor: సీఎం గారు.. సీఐ నుంచి రక్షించండి.. మహిళా కౌన్సిలర్ వేడుకోలు.. వైరల్ అవుతున్న వీడియో!

|

Jan 11, 2022 | 8:23 AM

ఏపీలో ప్రజా ప్రతినిధులకే రక్షణ కరువైంది. ఏకంగా నన్ను కాపాడండి అంటూ ముఖ్యమంత్రి ప్రకాశం జిల్లా చీరాల వైఎస్సార్‌సీపీ మహిళా కౌన్సిలర్ వేడుకుంటోంది. ఇందుకు సంబంధించి వీడియో రికార్డ్ వైరల్ అవుతోంది.

YCP Councillor: సీఎం గారు.. సీఐ నుంచి రక్షించండి.. మహిళా కౌన్సిలర్ వేడుకోలు.. వైరల్ అవుతున్న వీడియో!
Harassment
Follow us on

Police Inspector Harassment: ఏపీలో ప్రజా ప్రతినిధులకే రక్షణ కరువైంది. ఏకంగా నన్ను కాపాడండి అంటూ ముఖ్యమంత్రి ప్రకాశం జిల్లా చీరాల వైఎస్సార్‌సీపీ మహిళా కౌన్సిలర్ వేడుకుంటోంది. ఇందుకు సంబంధించి వీడియో రికార్డ్ వైరల్ అవుతోంది. సీఐ బారి నుంచి తమను రక్షించాలని అధికార పార్టీకి చెందిన మహిళా కౌన్సిలర్ మొరపెట్టుకున్నారు. తన సమస్యను వీడియోలో వివరించే ప్రయత్నం చేశారు.

ప్రకాశం జిల్లా చీరాల ఐదో వార్డు కౌన్సిలర్ సూరగాని లక్ష్మి భర్త నరసింహారావుకు స్థానికంగా బార్‌ అండ్‌ రెస్టారెంట్ ఉంది. డిసెంబరు 31న రాత్రి 11.20 గంటలకు వన్ టౌన్ సీఐ రాజమోహన్‌ సిబ్బందితో రెస్టారెంటుపై దాడి చేసిన తన భర్త పట్ల దురుసుగా ప్రవర్తించారని ఆమె ఆరోపించారు. బార్ సిబ్బందిని కొట్టడంతో పాటు తన భర్తను పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లి అసభ్య పదజాలంతో దూషించినట్లు ఆమె తెలిపారు.

ఈ గొడవపై జిల్లా పోలీసు అధికారులకు ఫిర్యాదు చేశామన్న అక్కసుతో ఈనెల 6న రాత్రి మరోసారి రెస్టారెంటుకు వచ్చి.. వ్యాపారం ఎలా చేస్తావో చూస్తానని బెదిరించారని లక్ష్మీ వాపోయారు. తప్పుడు కేసులు పెడతానని.. వ్యాపారం చేసుకోనివ్వకుండా చేస్తానని బెదిరించారన్నారు. సీఐ రాజ మోహన్‌పై పలు అవినీతి ఆరోపణలు ఉన్నాయన్నారు. సీఐ బారి నుంచి తమ కుటుంబాన్ని కాపాడాలని వీడియోలో కౌన్సిలర్ ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు.

కౌన్సిలర్ ఆరోపణలపై సీఐ రాజమోహన్ స్పందించారు. బార్ దగ్గర జరిగిన ఘటనపై క్లారిటీ ఇచ్చారు. నూతన సంవత్సరం రోజున బార్‌‌లో నుంచి కేకలు వినపడటంతో తాను బయట ఉండి సిబ్బందిని లోపలకు పంపానని చెప్పారు. ఎవరిపైనా దాడి చేయలేదని, దూషించలేదన్నారు. తనపై ఉద్దేశపూర్వకంగానే ఆరోపణలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. ఇదిలావుంటే, కౌన్సిలర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో మహిళా కౌన్సిలర్లకు పోలీసులకు రక్షణ కరవైతే, ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

Read Also….  Nalgonda District: మైసమ్మ గుడి ముందు మనిషి తల కేసులో పోలీసుల పురోగతి