ఓ వైపు యావత్ ప్రపంచం కరోనా మహమ్మారితో వణికిపోతున్నప్పటికీ.. స్మగ్లర్లు వారి పని వారు కానిస్తున్నారు. విదేశాల్లో ఉన్న వారు వందేభారత్ మిషన్‌లో భాగంగా స్వదేశాలకు వస్తూ.. గోల్డ్ స్మగ్లింగ్ ముఠాతో పాటు.. నిషేధిత డ్రగ్స్‌ను కూడా తీసుకోస్తూ.. కస్టమ్స్ అధికారులకు పట్టుబడుతున్నారు. ఇప్పటికే దేశంలో పలుచోట్ల అక్రమంగా బంగారాన్ని తీసుకోస్తూ పలువురు పట్టుబడుతున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా.. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో నిషేధిత పిల్స్‌ను గుర్తించారు చెన్నై కస్టమ్స్ అధికారులు. రెండు పోస్టల్ పార్శిల్స్‌లో 540 ఎండీఎంఏ పిల్స్‌ను గుర్తించి సీజ్ చేశారు. వీటి విలువ రూ.14 లక్షలకు పైగా ఉంటుందని తెలిపారు. ఈ పార్శిల్ నెదర్లాండ్స్ నుంచి వచ్చినట్లు గుర్తించారు. దీనికి సంబంధించి ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
Chennai Air Customs seized two postal parcels containing total 540 MDMA pills valued at Rs 16 lakhs which arrived from the Netherlands at Foreign Post Office, Chennai. Two persons were detained: Commissioner of Customs, Chennai International Airport pic.twitter.com/oAWfNfkxpK
— ANI (@ANI) July 9, 2020