ఒకటి కాదు రెండు కాదు… ఏకంగా మూడు కోట్ల కుచ్చుటోపీ.. డీఆర్డీఓలో ఉద్యోగాల పేరుతో మస్కా.. చివరికి పనిమనిషి కూడా

|

Apr 13, 2021 | 11:25 AM

ఒకటి కాదు రెండు కాదు... ఏకంగా మూడు కోట్ల కుచ్చుటోపీ. బాధితులు మేలుకునేలోపే డబ్బుతో ఉడాయించాడు. హైదరాబాద్ వనస్థలిపురంలో వెలుగులోకి వచ్చిందీ ఘటన.

ఒకటి కాదు రెండు కాదు... ఏకంగా మూడు కోట్ల కుచ్చుటోపీ.. డీఆర్డీఓలో ఉద్యోగాల పేరుతో మస్కా.. చివరికి పనిమనిషి కూడా
Jobs Cheating
Follow us on

ఒకటి కాదు రెండు కాదు… ఏకంగా మూడు కోట్ల కుచ్చుటోపీ. బాధితులు మేలుకునేలోపే డబ్బుతో ఉడాయించాడు. హైదరాబాద్ వనస్థలిపురంలో వెలుగులోకి వచ్చిందీ ఘటన. శారదానగర్ కి చెందిన సాయినాథ్ అనే వ్యక్తి డీఆర్డీఓలో ఉద్యోగాలిప్పిస్తానని యువతకు గాలెం వేశాడు. మూడు లక్షలు చెల్లిస్తే ఉద్యోగం ఇప్పిస్తానని మాయమాటలు చెప్పాడు. నిజమని నమ్మిన ఎంతోమంది సాయినాథ్ ను ఆశ్రయించారు. అడ్వాన్స్ కింద అమౌంట్ చెల్లించారు. వాయిదాల పద్దతిలో సాయినాథ్ అడిగినప్పుడల్లా అమౌంట్ ట్రాన్స్ ఫర్ చేశారు. తీరాచూస్తే అందర్నీ ముంచేసి పారిపోయాడు. సాయినాథ్ కి అడిగినంత డబ్బు ఇచ్చారు. కానీ గడువు తీరినా ఉద్యోగం మాత్రం రాలేదు. ఎన్నోసార్లు వెళ్లి అడిగినా ఇప్పుడు అప్పుడు అంటూ కాలం వెళ్లదీశాడు. ఒక్కొక్కరి నుంచి దాదాపు 3 నుంచి 5 లక్షల వరకు వసూలు చేశాడు

సాయినాథ్ మామూలోడు కాదు. డబ్బున్న వాళ్లనే కాదు ఆఖరికి పనిమనిషిని కూడా వదల్లేదు. తన ఇంట్లో పనిమనిషికి క్యాంటిన్ లో జాబ్ ఇప్పిస్తానని లక్షన్నర వసూలు చేశాడు. అంతోఇంతో డబ్బు వస్తుందని నమ్మిన పనిమనిషి అప్పు చేసి మరి డబ్బు సాయినాథ్ చేతిలో పెట్టింది. ఆఖరికి ఆమెను కూడా మోసంచేశాడు చీటర్ సాయినాథ్. మరోవైపు హెల్త్ ఎక్విప్ మెంట్ కొనాలంటూ ఓ వ్యక్తి దగ్గర ఏకంగా 40లక్షలు తీసుకున్నాడు. వారికి కూడా ఎగనామం పెట్టాడు. ఇలా చాలామంది బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. అమాయకుల నుంచి సాయినాథ్ కోట్ల రూపాయలు కొల్లగొట్టాడు. కానీ ఇదంతా తనకు తెలియదంటోంది అతని తల్లి. రోజూ ఉద్యోగానికి వెళ్లి వస్తున్నానని చెప్పేవాడు తప్ప ఇలా చేశాడంటే నమ్మలేకపోతున్నానని చెబుతోంది.

Also Read: పెరట్లో పేడ దిబ్బ తొలగిస్తుంటే… చేతికి అస్థిపంజరం తగిలింది.. ఆరా తీయగా షాకింగ్ ట్విస్ట్

కాబోయే వాడ్ని కలవడానికి రాత్రి పూట వెళ్లింది… గడ్డి కుప్పలో శవమై తేలింది.. అసలు ఏం జరిగిందంటే..