Sachin Vaze in CCTV footage: అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాల కేసులో మరో ట్విస్ట్.. డబ్బుల కట్టలతో హోటల్‌కు..

|

Mar 25, 2021 | 8:49 PM

Sachin Vaze cash Bags: అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాల కేసులో మరో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో అరెస్టైన పోలీస్​ అధికారి సచిన్ వాజే.. డబ్బుల కట్టలను తన కారులో తీసుకువెళ్లినట్లు ఓ వీడియో ఒకటి  బయటపడింది. ఈ కేసులో...

Sachin Vaze in CCTV footage: అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాల కేసులో మరో ట్విస్ట్.. డబ్బుల కట్టలతో హోటల్‌కు..
Sachin Vaze In Cctv Footage
Follow us on

అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాల కేసులో మరో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో అరెస్టైన పోలీస్​ అధికారి సచిన్ వాజే.. డబ్బుల కట్టలను తన కారులో తీసుకువెళ్లినట్లు ఓ వీడియో ఒకటి  బయటపడింది. ఈ కేసులో ఇది పెద్ద సంచలనంగా మారుతోంది. ఓ హోటల్లోకి వెళ్లినప్పుడు స్కానర్ల ఫుటేజీలో బ్యాగులో డబ్బుల కట్టలు ఉన్నట్లు కనిపించింది.

అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాల కేసులో అరెస్టైన పోలీస్​ అధికారి సచిన్ వాజే.. డబ్బుల కట్టలను తన కారులో తీసుకువెళ్లినట్లు ఓ వీడియో ఒకటి బయటకువచ్చింది. ఓ హోటల్లోకి వెళ్లినప్పుడు స్కానర్ల ఫుటేజీలో బ్యాగులో డబ్బుల కట్టలు ఉన్నట్లు కనిపిస్తోంది.

అంబానీ ఇంటివద్ద పేలుడు పదార్థాల కేసు.. నాటకీయ మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో అరెస్టై, సస్పెండైన పోలీస్​ అధికారి సచిన్​ వాజేకు సంబంధించిన ఓ సీసీటీవీ వీడియో.. కలకలం సృష్టిస్తోంది. ఓ 5 స్టార్ హోటల్లోకి ఆయన తన కారులో డబ్బుల కట్టలను తీసుకువెళ్లినట్లుగా గుర్తించారు. స్కానర్లలో నమోదైన ఫుటేజీలో ఈ విషయం కనిపించింది.

మరోవైపు.. ఈ కేసులో వాజేను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్​ఐఏ) ప్రత్యేక కోర్టు ముందు శుక్రవారం హాజరుపరిచింది. తనకు ఈ కేసుకూ ఏ సంబంధమూ లేదని న్యాయస్థానం ఎదుట సచిన్​ వాజే చెప్పుకున్నాడు. తనను ఈ కేసులో అన్యాయంగా ఇరికించారని ఆవేదన వ్యక్తం చేశాడు. సచిన్​వాజే ఎన్​ఐఏ కస్టడీని కోర్టు ఏప్రిల్​ 3 వరకు పొడిగించింది.

 

ఇవి కూడా చదవండి : LIC SIIP Policy: రోజూ రూ. 111 చెల్లించి .. 7.08 లక్షల తీసుకోండి.. జీవిత బీమానే కాదు మరింత ఆర్ధిక భద్రత..
LIC Home Loan offer: హోమ్ లోన్ తీసుకున్నవారికి బంపర్ ఆఫర్.. ఆరు EMIలు మాఫీ.. వారికి మాత్రమే…