Dollar Boy Arrested: ఓ యువతిని శారీరక, మాసనిక వేధింపులకు గురిచేసి.. 139 మందిపై అత్యాచారం కేసు పెట్టించిన కేసులో కీలక నిందితుడు డాలర్ బాయ్ ఎట్టకేలకు చిక్కాడు. అతడిని సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా ఆగష్టు 20న తనపై 139 మంది తనపై అత్యాచారం చేశారని ఓ యువతి పంజాగుట్ట పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. అందులో పలువురు సినీ ప్రముఖుల పేర్లు కూడా ఉన్నాయి. ఇక ప్రత్యేక దర్యాప్తు కోసం ఈ కేసును సీసీఎస్‌కికు పోలీసులు బదిలీ చేశారు. ఈ నేపథ్యంలో ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న కొంత మందిని పోలీసులు విచారించారు. ఇక ఇందులో కీలకంగా మారిన డాలర్ బాయ్‌ని ఈ రోజు రిమాండ్‌కి తరలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Read More:
పది రోజుల్లో బయటకు రానున్న చిన్నమ్మ..!