Telangana: వామ్మో.. ఇదేం స్కామ్‌రా నాయనా..! రూ.కోటి 62 లక్షలు నొక్కేసిన సబ్ పోస్ట్ మాస్టర్.. సీబీఐ కేసు

|

Mar 10, 2022 | 1:13 PM

అతనో పోస్ట్ మాస్టర్.. కానీ ఫ్రాడ్ చేయడంలో మాత్రం మాస్టర్ మైండ్. ఎవరూ ఊహించని విధంగా స్కామ్ చేసి.. సీబీఐ అధికారులనే విస్మయానికి గురిచేశాడు. కేంద్ర ప్రభుత్వ ఖజానా నుంచే సొమ్ము కాజేశాడు.

Telangana: వామ్మో.. ఇదేం స్కామ్‌రా నాయనా..! రూ.కోటి 62 లక్షలు నొక్కేసిన సబ్ పోస్ట్ మాస్టర్.. సీబీఐ కేసు
Small saving Schemes
Follow us on

అతనో పోస్ట్ మాస్టర్.. కానీ ఫ్రాడ్ చేయడంలో మాత్రం మాస్టర్ మైండ్. ఎవరూ ఊహించని విధంగా స్కామ్ చేసి.. సీబీఐ(Cbi) అధికారులనే విస్మయానికి గురిచేశాడు. కేంద్ర ప్రభుత్వ ఖజానా నుంచే సొమ్ము కాజేశాడు. అధికారులను మాయ చేసి.. ఏమార్చి… పోస్టాఫీస్ ద్వారా అందించే కేంద్ర పథకాలకు సంబంధించిన పింఛన్, ఉపాధి హామీ నిధులను పక్కదారి పట్టించాడు. అతను ఏకంగా రూ.కోటి 62 లక్షలను కాజేసినట్లు అధికారులు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే… నల్లగొండ జిల్లా(nalgonda district) చింతపల్లి పోస్టాఫీస్ పరిధిలో ఏడెనిమిది గ్రామాలున్నాయి. అక్కడ అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్‌గా నరేశ్ అనే వ్యక్తి వర్క్ చేస్తున్నాడు. ఆ గ్రామాలకు సంబంధించిన ప్రజలు.. ఉపాధి హామీ పథకానికి సంబంధించిన నిధులు ఆ పోస్టాఫీసులోనే  తీసుకుంటుంటారు.  అయితే ఈక్రమంలోనే ఆ అకౌంట్ల సంఖ్యను ఎక్కువగా చూపి డబ్బులను డ్రా చేసిన సబ్ పోస్ట్ మాస్టర్.. అనంతరం ఖాతాదారులకు నగదు చెల్లించినట్లు లెక్కలు చూపి.. ఆ సొమ్మంతా కాజేశాడు. ఒక్కో గ్రామం పరిధిలో రూ.20 లక్షల మేర నొక్కేశాడు. అయితే ఆడిట్ చేస్తుండగా అయ్యగారి బాగోతం బయటపడింది. దీంతో నరేశ్‌పై 2020లో  డివిజన్ సూపరింటెండెంట్ కంప్లైంట్ చేశారు.. ఈ క్రమంలోనే నరేశ్‌పై పోస్టల్ ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. తాజాగా నరేశ్‌పై కేసు నమోదు చేసిన సీబీఐ అధికారులు విచారణ చేపట్టారు.

Also Read: Viral: మత్స్యకారుల వలకు చిక్కిన అరుదైన చేప.. బరువెంతో తెలిస్తే మతిపోతుంది.!