ఎంపీ కేకేను బురిడీ కొట్టించే ప్రయత్నం.. వ్యక్తిపై కేసు నమోదు

కేంద్ర ప్రభుత్వ పథకం పేరుతో ఎంపీ కేకేను బురిడి కొట్టించే ప్రయత్నం చేసిన మహేష్ అనే వ్యక్తిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

ఎంపీ కేకేను బురిడీ కొట్టించే ప్రయత్నం.. వ్యక్తిపై కేసు నమోదు
Follow us

| Edited By:

Updated on: Aug 26, 2020 | 7:01 AM

Telangana MP KK: కేంద్ర ప్రభుత్వ పథకం పేరుతో ఎంపీ కేకేను బురిడి కొట్టించే ప్రయత్నం చేసిన మహేష్ అనే వ్యక్తిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. వివరాల్లోకి వెళ్తే.. కేంద్ర పరిశ్రమల శాఖ డిప్యూటీ డైరెక్టర్ అంటూ ఇటీవల ఎంపీ కేకేకు ఫోన్ చేసిన మహేష్‌..25 మంది నిరుద్యోగులకు రూ.25 లక్షల రుణం ఇస్తామని తెలిపాడు. మంత్రి కేటీఆర్ సిఫార్సుతో మీకు ఇవ్వాలనుకుంటున్నామని ఎంపీకి చెప్పాడు. దీనిపై తన కుమార్తె, బంజారాహిల్స్‌ కార్పొరేటర్‌ గద్వాల విజయ లక్ష్మితో మాట్లాడాలని కేకే సూచించారు.

ఇక తమ డివిజన్లలో నిరుద్యోగులకు ప్రయోజనం ఉంటుందని భావించిన విజయలక్ష్మి కొంతమందికి ఈ విషయాన్ని చెప్పారు. అయితే ప్రాసెసింగ్ ఫీజుగా ఒక్కొక్కరు 1.25 లక్షలు తన అకౌంట్‌లో వేయాలని మహేష్ కోరడంతో.. అఖిల్ అనే యువకుడు రూ.50వేలు వేశాడు. ఈ లోపు మహేష్ మాటలపై అనుమానంతో వాకబు చేసిన కేకేకు.. అది బోగస్ అని తెలియడంతో మిగిలిన వారు డబ్బులు వేయకుండా వారించారు. డబ్బులు వేసిన అఖిల్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. అతడిపై కేసు నమోదు చేశారు.

Read More:

డిజిటల్ క్లాసులపై గైడ్ లైన్స్ విడుదల

ఆ భూములను వెనక్కి తీసకుంటాం…