Yadadri Car Fire Accident: యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం గూడూరు టోల్ ప్లాజా వద్ద ఓ కారు దగ్ధమైంది. వరంగల్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న కారు గూడూరు టోల్ ప్లాజా వద్దకు రాగానే అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో ఒక్కసారిగా కారులో మంటలు వ్యాపించాయి. అప్రమత్తమైన ప్రయాణికులు కారు దిగి దూరంగా వెళ్లారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపు చేశారు.
హైదరాబాద్‌లోని అగర్వాల్ ఇండస్ట్రీకి చెందిన సంజయ్ కుమార్, శివ కుమార్ అనే ఇద్దరు ప్రయాణీకులు వరంగల్ వెళ్లి తిరగివస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కారులో పొగలు వస్తుండటం గమనించిన ఇద్దరు.. గూడూరు టోల్ ప్లాజాకు రాగానే అప్రమత్తమై దిగిపోయారు. అనంతరం మంటలు కారు మొత్తం వ్యాపించి కాలిబూడిదైంది. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదానికి సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. కారు అగ్ని ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే, సరిగ్గా టోల్ ప్లాజా వద్దే ప్రమాదం జరగడంతో వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అగ్ని మాపక సిబ్బంది సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది.
Read Also…. TS Corona Cases: తెలంగాణలో కొత్తగా కలవరం.. ఇవాళ కాస్త పెరిగిన కరోనా వైరస్.. కొత్త పాజిటివ్ కేసులు ఎన్నంటే..?