Car Accident: పీకలదాకా తాగడం.. ఆ మత్తులో కారెక్కడం.. ప్రాణాలు తీస్తున్న తాగుబోతులు

| Edited By: Anil kumar poka

Mar 19, 2022 | 5:53 PM

Car Accident: పీకలదాకా తాగడం.. ఆ మత్తులో కారెక్కడం. తూలుతూనే స్టీరింగ్‌ పట్టుకుని 100 కిలోమీటర్ల స్పీడ్‌తో యాక్సలేటర్‌ తొక్కడం.. కళ్లుమూసుకుని ఎవర్నో ఒకర్ని గుద్దడం...

Car Accident: పీకలదాకా తాగడం.. ఆ మత్తులో కారెక్కడం.. ప్రాణాలు తీస్తున్న తాగుబోతులు
Follow us on

Car Accident: పీకలదాకా తాగడం.. ఆ మత్తులో కారెక్కడం. తూలుతూనే స్టీరింగ్‌ పట్టుకుని 100 కిలోమీటర్ల స్పీడ్‌తో యాక్సలేటర్‌ తొక్కడం.. కళ్లుమూసుకుని ఎవర్నో ఒకర్ని గుద్దడం.. లేదంటే వాళ్ల ప్రాణాలే తీసుకోవడం.. నగరంలో కామన్‌ అయిపోయింది. హైదరాబాద్‌ గచ్చిబౌలి (Gachibowli)లో మళ్లీ అదే సీన్‌ రిపీట్‌ అయింది. కాకపోతే ఈసారి వీళ్లు ఎవర్నీ బండితో డ్యాష్‌ ఇవ్వలేదు.. మతిమీరిన వేగంతో కారు డివైడర్‌ను ఢీకొట్టి మహిళ ప్రాణాలు తీశారు. అంతేకాదు.. తీవ్రంగా గాయపడ్డ వారు కూడా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఇంతకీ ఈ పాపం ఎవరిది..?

డ్రంక్ అండ్ డ్రైవ్ ముగ్గురి ప్రాణాలు తీసింది. పోలీసులు డ్రంకెన్‌ డ్రైవ్‌లు చేపట్టినా…కేసులు పడుతున్నా..అధిక మొత్తంలో చలానాలు వేస్తున్నా.. తాగుబోతులు మాత్రం మారడం లేదు.. నిత్యం ఎక్కడో ఒకచోట ప్రమాదాలు జరుగుతునే ఉన్నాయి. హోలీ పండుగరోజు లిక్కర్‌ షాపులు బంద్‌ ఉన్నా.. మందు ఎలా దొరికింది.? ఎవరు అమ్మారు..? పండుగ బూచిలో యువత తాగి పట్టపగలే ర్యాష్‌ డ్రైవింగ్‌తో అమాయకుల ప్రాణాలు తీయడమే కాదు.. తమ ప్రాణాలు పోయేలే చేసుకుంటున్నారు. ఇప్పటికే డ్రంక్ డ్రైవ్‌పై టీవీ9 సైతం హెచ్చరించినా.. మందు బాబుల్లో మాత్రం చలనం రావడం లేదు.

మద్యం మత్తే కారణం:

గచ్చిబౌలి కారు ప్రమాద ఘటనకు మద్యం మత్తే కారణమని తేల్చారు పోలీసులు. గచ్చిబౌలిలోని ప్రిజం పబ్‌లో హోలి ఈవెంట్‌కు రోహిత్‌, గాయత్రి హాజరైనట్లు విచారణలో వెల్లడించారు. వీళ్లిద్దరూ పీకల్లోతు మద్యం తాగి హోలీ ఈవెంట్‌లో ఎంజాయ్‌ చేశారు. మత్తులో అతివేగంగా కారు నడుపుతూ డివైడర్‌ను ఢీకొట్టిని తాను చనిపోవడమే కాకుండా… మరో ఇద్దరి మరణానికి కారణమయ్యాడు రోహిత్‌. మత్త జగత్తుకు ఇప్పటికైనా పోలీసుల చెక్‌ పెడతారా..? అనేది వేచి చూడాలి.

ఇవి కూడా చదవండి:

AP Crime News: చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిలో శిశువు మాయం.. ఎత్తుకెళ్లిన కిలాడీ లేడి.. వీడియో

Road Accident: ఆంధ్రా – కర్ణాటక సరిహద్దులో ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది దుర్మరణం..!