మొత్తం ఏడుగురు సభ్యులు.. సుమోలో జెట్ స్పీడ్‌తో వెళ్లారు.. సినిమా స్టయిల్‌లో కిడ్నాప్ చేశారు. పక్కాగా ప్లాన్ అమలు చేసి ఓ బిజినెస్ మెన్ తనయుడ్ని ఎత్తుకెళ్లారు. ఏకంగా మూడు కోట్ల రూపాయలు డిమాండ్ చేశారు. ఇదంతా క్షణాల్లో జరిగిపోయింది. కానీ ఖాకీలు సీన్‌లోకి ఎంటరయ్యాక.. సీన్ సితారైంది. గంటల వ్యవధిలో కిడ్నాప్ డ్రామాకు తెరదింపి శభాష్ పోలీస్ అనిపించుకున్నారు.
తిరుప్పూర్ జిల్లాకు చెందిన శివప్రదీప్ ఓ వ్యాపారవేత్త కొడుకు. వ్యాపార లావాదేవీల కోసం కారులో వెళ్తున్నాడు. ఆ సమయంలో మొత్తం ఏడుగురు సభ్యులు శివ ప్రదీప్ కారును రౌండప్ చేసి క్షణాల వ్యవధిలో కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత శివ ప్రదీప్ తండ్రికి కాల్ చేసి మూడు కోట్ల రూపాయలు డిమాండ్ చేశారు. డబ్బు ఇస్తే సరి.. లేదంటే అంతే సంగతులని వార్నింగ్ ఇచ్చారు.
కిడ్నాపర్ల బెదిరింపులతో కంగారుపడ్డ శివ ప్రదీప్ తండ్రి వాళ్లు అడిగిన మొత్తాన్ని ఇచ్చేశాడు. ఆ తర్వాత కాంగేయం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కిడ్నాప్ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. సీసీ ఫుటేజ్‌ను తిరగేశారు. నిందితుల్ని గుర్తించి.. క్యాష్ మొత్తాన్ని సీజ్ చేశారు.
ఇవి కూడా చదవండి: TTD Seva Tickets: తిరుమల శ్రీవారి ఆర్జితసేవ టికెట్లు విడుదల.. అందుబాటులో రూ.300 దర్శన టోకెట్లు