Bulli Bai Case: బుల్లి బాయ్ యాప్ సృష్టికర్త అరెస్ట్.. అస్సాంలో అదుపులోకి తీసుకున్న పోలీసులు..

|

Jan 06, 2022 | 3:10 PM

Bulli Bai App Case: బుల్లి బాయ్ యాప్.. దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపిన సంగతి తెలిసిందే. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో

Bulli Bai Case: బుల్లి బాయ్ యాప్ సృష్టికర్త అరెస్ట్.. అస్సాంలో అదుపులోకి తీసుకున్న పోలీసులు..
Bulli Bai Case
Follow us on

Bulli Bai App Case: బుల్లి బాయ్ యాప్.. దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపిన సంగతి తెలిసిందే. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో బుల్లి బాయ్ యాప్ సృష్టికర్తను ఢిల్లీ పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. బుల్లి బాయ్ యాప్ సృష్టికర్త నీరజ్ బిష్ణోయ్‌ (21) ను ఢిల్లీ పోలీసులు అస్సాంలో అరెస్టు చేశారు. దీంతో ఈ కేసులో అరెస్టు అయిన వారి సంఖ్య నాలుగుకు చేరింది. బుల్లి బాయ్ యాప్ ద్వారా.. చాలా మంది ముస్లిం యువతులు, మహిళల ఫొటోలను వారి అనుమతి లేకుండా బుల్లి బాయ్ యాప్‌లో అప్‌లోడ్ చేసి ఆన్‌లైన్‌లో వేలం వేసిన ఆరోపణలు దేశంలో తీవ్ర కలకలం సృష్టించాయి. ఢిల్లీకి చెందిన ఓ మహిళా జర్నలిస్టు ఈ ఉదంతాన్ని వెలుగులోకి తెచ్చింది. జనవరి 1న దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసందే.

కాగా..అస్పాంలోని దిగంబర్ జొర్హట్‌కు చెందిన నీరజ్ బిష్ణోయ్ బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడని పోలీసులు తెలిపారు. భోపాల్‌లోని వెల్లూర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో అతను ఇంజనీరింగ్ చదువుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసు దర్యాప్పును ముమ్మరం చేసిన ఢిల్లీ పోలీసులు అస్సాంలోని జొర్హట్‌లో నీరజ్ ను అరెస్టు చేశారు. ఆయనతోపాటు ఓ డివైజ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ డివైజ్ ద్వారానే బుల్లి బాయ్ యాప్ డెవలప్ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.

అరెస్ట్ అనంతరం నిందితుడిని ఢిల్లీకి తీసుకురాబోతున్నట్టు తెలుస్తోంది. ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్‌ పరిధిలోని ఐఎఫ్ఎస్‌వో బృందం నీరజ్ బిష్ణోను అరెస్టు చేసిందని ఈ బృందం చీఫ్ కేపీఎస్ మల్హోత్రా తెలిపారు. గిట్ హబ్‌లో బుల్లి యాప్ తయారీదారు ఆయనే అని పేర్కొన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో ప్రధాన నిందితుడు అతనేనని తెలిపారు.

Also Read:

గుడ్‌న్యూస్.. QR కోడ్‌ని స్కాన్ చేసి డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు తెలుసా.. పూర్తి వివరాలు ఇవే..

దేశంలో ఒమిక్రాన్ టెన్షన్.. భారీగా పెరుగుతోన్న కరోనా కేసులు.. ఎన్నికల వాయిదానే శ్రేయస్కరమా.?