Vijayawada Murder: మరోసారి ఉలిక్కిపడిన బెజవాడ.. బిల్డర్‌ను దారుణంగా హత్య చేసిన గుర్తు తెలియని వ్యక్తులు..

|

Nov 01, 2021 | 12:23 PM

రీల్‌ సీన్‌ను మించిన స్థాయిలో రియల్‌ రక్త చరిత్ర బెజవాడలో హడలెత్తిస్తోంది. బిజినెస్ మ్యాన్ రాహుల్ మర్డర్ కేసును మరిచిపోక ముందే మరో హత్య జరిగింది.

Vijayawada Murder: మరోసారి ఉలిక్కిపడిన బెజవాడ.. బిల్డర్‌ను దారుణంగా హత్య చేసిన గుర్తు తెలియని వ్యక్తులు..
Pithala Appala Raju
Follow us on

రీల్‌ సీన్‌ను మించిన స్థాయిలో రియల్‌ రక్త చరిత్ర బెజవాడలో హడలెత్తిస్తోంది. బిజినెస్ మ్యాన్ రాహుల్ మర్డర్ కేసును మరిచిపోక ముందే మరో హత్య జరిగింది. తాజాగా ఓ బిల్డర్‌ హత్య జరగడంతో విజయవాడవాసులు హడలిపోతున్నారు. బిల్డర్ అప్పలరాజును దారుణంగా హత్య చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. బిల్డర్ అప్పలరాజు ఉంటున్న ఇంట్లోకి చొరబడిన దుండగులు దారుణంగా హత్య చేశారు. హత్య జరిగిన వెంటనే అతని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. సంఘటన స్థలంలో క్లూస్ ఆధారాలు సేకరించే పనిలో పడింది. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బ‌ృందాలను ఏర్పాటు చేశారు. ఈ హత్యకు కారణాలేంటి? బిల్డర్‌ అప్పలరాజుని హతమార్చిందెవరు? వీరిలో ఏ వన్, ఏ టూ ఎవరు? అనేది ఇప్పుడు మిస్టరీగా మారింది.

ఆదివారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న బిల్డర్‌ను తల పగల కొట్టి హత్య చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. హత్య జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేరని తెలుస్తోంది. అయితే అతని కుటుంబ సభ్యులు విశాఖపట్నంలో ఉంటారని తెలిపారు.

కేవలం వ్యాపార నిమిత్తం మాత్రమే అప్పల రాజు విజయవాడలోని వాంబే కాలనీలో ఉంటున్నారని వెల్లడించారు. వివాహేతర సంబంధమే హత్యకు కారణంగా భావిస్తున్నారు విజయావడ పోలీసులు.

ఇవి కూడా చదవండి: PM Modi: విదేశాల నుంచి రావడమే ఆలస్యం 13 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని సమావేశం.. ఆ అంశంపైనే చర్చ..

LPG Price Rise: దీపావళి ముందు భారీ షాక్.. పెరిగిన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధర.. ఎంత పెరిగిందంటే..