బార్డర్‌లో బంగారం, వెండి ఆభరణాలు

| Edited By:

Aug 08, 2020 | 5:04 AM

బార్డర్‌లో బంగారం, వెండి నగలు కలకలం రేపాయి. భారత్‌, బంగ్లా సరిహద్దుల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. బంగ్లాదేశ్‌కు అక్రమంగా బంగారం, వెండి ఆభరణాలను తరలిస్తున్న బీఎస్ఎఫ్ గుర్తించింది. వివరాల్లోకి..

బార్డర్‌లో బంగారం, వెండి ఆభరణాలు
Follow us on

బార్డర్‌లో బంగారం, వెండి నగలు కలకలం రేపాయి. భారత్‌, బంగ్లా సరిహద్దుల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. బంగ్లాదేశ్‌కు అక్రమంగా బంగారం, వెండి ఆభరణాలను తరలిస్తున్న బీఎస్ఎఫ్ గుర్తించింది. వివరాల్లోకి వెళితే.. వెస్ట్ బెంగాల్‌లోని బసీర్‌హట్ సమీపంలో కైజురి వద్ద ఓ బైక్‌పై వెళ్తున్న వ్యక్తి నుంచి వీటిని స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని సౌత్ బెంగాల్ బీఎస్ఎఫ్ అధికారులు శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. కైజురి సమీపంలో గురువారం రాత్రి.. ఓ స్మగ్లర్ బైక్‌పై సరిహద్దుకు చేరుకున్నాడని.. అతడిని గమనించిన బీఎస్ఎఫ్ సిబ్బంది అతడిని ఆపేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో బైక్‌ను వదిలేసి పారిపోయాడు. వెంటనే బైక్‌ను స్వాధీనం చేసుకున్న సిబ్బంది తనిఖీ చేయగా.. అందులో 13కిలోల వెండి ఆభరణాలు, పలు బంగారు ఆభరణాలు ఉన్నట్లు గుర్తించారు. వీటి విలువ రూ.9.60 లక్షలు ఉంటుందన్నారు. బైక్ నంబర్‌ ప్లేట్‌ ఆధారంగా నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు
అధికారులు తెలిపారు.

Read More :

కర్ణాటకలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు
మహారాష్ట్రలో తగ్గని కేసులు.. మళ్లీ 10వేలకు పైగానే