వెస్ట్ బెంగాల్‌లో అక్రమ వ్యాపారాలకు అడ్డు అదుపులేకుండా పోతుంది. విచ్చల విడిగా అక్రమ వ్యాపారాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో పలు వాహనాలను స్థానిక పోలీసులతో పాటుగా.. సరిహద్దు ప్రాంతాల్లో బీఎస్ఎఫ్ జవాన్లు సైతం చెక్ చేస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం నాడు రాష్ట్రంలోని నార్త్ పరగణ జిల్లాలోని పెట్రాపోల్ చెక్ పోస్ట్ వద్ద బీఎస్ఎఫ్ జవాన్లు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఓ ట్రక్కులో భారీ ఎత్తున హిల్షా ఫిష్‌ను తరలిస్తున్నట్లు గుర్తించారు. వీటి విలువ రూ.11.26 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. ట్రక్కుతో పాటు, అందులో ఉన్న హిల్షా ఫిష్‌ను సీజ్ చేశామని.. నిందితుడిని అరెస్ట్ చేశామని స్థానిక పోలీసులు తెలిపారు.
West Bengal: Personnel of Border Security Force (BSF) apprehended a smuggler & seized a truck & Hilsha fish worth Rs 11,26,000 during the routine vehicle checking at Integrated Check Post Petrapole in North 24 Parganas yesterday. pic.twitter.com/8auLQK8LoD
— ANI (@ANI) August 6, 2020
Read More :