అప్పగింతల్లో ఎక్కి ఎక్కి ఏడ్చిన పెళ్లికూతురుకు గుండెపోటు.. ఒక్కసారిగా పెళ్లింట్లో చావు భాజా.. ఒడిశాలో విషాద ఘటన..

|

Mar 06, 2021 | 5:20 PM

BRIDE GOT HEART ATTACK : అప్పటిదాకా పెళ్లి వేడుకలతో కళకళలాడిన ఆ ఇంట్లో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి.

అప్పగింతల్లో ఎక్కి ఎక్కి ఏడ్చిన పెళ్లికూతురుకు గుండెపోటు.. ఒక్కసారిగా పెళ్లింట్లో చావు భాజా.. ఒడిశాలో విషాద ఘటన..
Follow us on

BRIDE GOT HEART ATTACK : అప్పటిదాకా పెళ్లి వేడుకలతో కళకళలాడిన ఆ ఇంట్లో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. పుట్టింటిని వదల్లేక అప్పగింతల సమయంలో ఎక్కువగా ఏడ్చి గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయిందో నవ వధువు. ఈ విషాద ఘటన ఒడిశాలోని సోనేపుర్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..

జులుందా గ్రామానికి చెందిన గుప్తేశ్వరి సాహూ అలియాస్‌ రోజీకి బాలాంగిర్‌ జిల్లా తెటెల్‌గావ్‌ గ్రామానికి చెందిన బిశికేశన్‌తో వివాహం నిశ్చయమైంది. శుక్రవారం వీరి పెళ్లి ఘనంగా జరిగింది. వేడుకల అనంతరం వధువు కుటుంబసభ్యులు కూతుర్ని అత్తవారింటికి సాగనంపేందుకు ‘బిదాయి(అప్పగింతలు)’ జరుపుతుండగా.. రోజీ ఏడుస్తూనే ఉంది. అలా ఏడ్చిఏడ్చి ఉన్నట్టుండి కుప్పకూలింది. దీంతో ఆందోళనకు గురైన కుటుంబసభ్యులు ఆమెను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. గుండెపోటుతో రోజీ ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు వెల్లడించారు.

ఆమె తండ్రి ఇటీవల మరణించడంతో రాజీ ఇంకా ఆ సంఘటన నుంచి బయటకు రాలేకపోయింది. మానసికంగా బాధపడుతోంది. ఈ సమయంలోనే ఆమెకు కుటుంబ సభ్యులు పెళ్లి నిశ్చయించడంతో ఇంకా కుంగుబాటుకు లోనయింది. అయినప్పటికీ పెళ్లికి సిద్ధమైంది. అయితే పెళ్లి అయ్యాక అప్పగింతల సమయంలో అందరిని విడిచిపెట్టి వెళ్లిపోతున్నాననే భావన ఆమె మనసులో ఉండిపోయింది. దీంతో ఒక్కసారిగా ఎక్కి ఎక్కి ఏడవడంతో కార్డియాక్ అరెస్ట్ జరిగిందని వైద్యులు చెబుతున్నారు.

నిజానికి కార్డియాక్ అరెస్ట్ అనేది ఒక్కసారిగా సంభవిస్తుంది. గుండె జబ్బు ఉన్నవారికి కార్డియాక్ అరెస్ట్ వచ్చే అవకాశం ఉంది. ఛాతీ నొప్పి,ఊపిరి, ఛాతీ బిగుతు, మైకము, స్పృహ కోల్పోవడం, అలసట వంటి లక్షణాలు గుండె ఆగిపోవడానికి ముందు ఉండే లక్షణాలు. ఏది ఏమైనా ఒక్కసారిగా పెళ్లికూతరు చనిపోవడంతో ఆ గ్రామంలో విషాధ ఛాయలు అలుముకున్నాయి.

వారానికి ఒకసారి పెళ్లి కూతురుగా ముస్తాబవుతోంది.. గత 16 సంవత్సరాలుగా ఇదే తంతు.. అసలు కారణం తెలిస్తే షాకవుతారు.!