పంజాబ్‌లోని లూథియానా కోర్టులో గురువారం భారీ పేలుడు సంభవించింది. కోర్టు మూడో అంతస్తులో పేలుడు జరగడంతో గోడ కూలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు మరణించినట్టు అక్కడి స్థానికులు చెబుతున్నారు. అయితే, ఈ విషయాన్ని అధికారికంగా ఇంకా ధ్రువీకరించలేదు. లూథియానా కోర్టులోని మూడో అంతస్తులో ఈరోజు మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో అకస్మాత్తుగా పేలుడు చోటుచేసుకుంది.
మూడో అంతస్తులోని కోర్టు నంబర్ 9 సమీపంలోని బాత్రూంలో పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి కోర్టు భవనం మొత్తం దద్దరిల్లింది. భవనం అద్దాలు పగలడంతో పాటు పార్కింగ్‌లో పార్క్ చేసిన కార్లు కూడా దెబ్బతిన్నాయి. సిలిండర్ పేలడంతో ఘటనా స్థలంలో ఉన్న ప్రజలు ఆందోళనతో పరుగులు తీశారు. పేలుడు ఘటనపై పోలీసులు, అధికారులు ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. కోర్టులో గందరగోళం నెలకొంది. అయితే న్యాయవాదుల సమ్మె కారణంగా సాధారణ రోజులతో పోలిస్తే గురువారం ఇక్కడ రద్దీ తక్కువగా ఉంది.
పోలీసు ఉన్నతాధికారులు, పరిపాలన అధికారులు, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ ఘటనాస్థలికి చేరుకున్నారు. కోర్టు ప్రాంగణాన్ని అన్ని వైపుల నుంచి పోలీసులు చుట్టుముట్టారు. హైఅలర్ట్ ప్రకటించి నగరవ్యాప్తంగా దిగ్బంధనం చేశారు. ముఖ్యమంత్రి చరణ్‌జిత్‌సింగ్ చన్నీ బహిరంగ సభలో ప్రసంగించేందుకు ఈరోజు నగరానికి చేరుకుంటున్నారు.
Punjab | Several feared injured in explosion in Ludhiana District Court Complex
Details awaited. pic.twitter.com/H3jaqit93H
— ANI (@ANI) December 23, 2021
Read Also..Demicron Symptoms: ఒమిక్రాన్+డెల్టా కజీన్ ‘డెల్మిక్రాన్’.. వైరస్ సోకిన వారిలో లక్షణాలేంటంటే..