Road Accident: సోదరిని పరీక్ష రాయించేందుకు తీసుకెళ్తున్న అన్న.. వెంటాడిన విషాదం

|

Sep 17, 2021 | 1:13 PM

గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో తీవ్ర విషాదం నెలకుంది. చెల్లిని ఎగ్జామ్ రాయించేందుకు తీసుకెళ్తూ రోడ్డు ప్రమాదంలో అన్న ప్రాణాలు విడిచాడు. చెల్లికి కూడా గాయాలయ్యాయి.

Road Accident: సోదరిని పరీక్ష రాయించేందుకు తీసుకెళ్తున్న అన్న.. వెంటాడిన విషాదం
Accident
Follow us on

గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో విషాదం చోటుచేసుకుంది. సోదరిని పరీక్ష రాయించేందుకు తీసుకెళ్తున్న అన్న…రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. దీంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకుంది. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో జరిగిన ఈ ఘటన పలువురిని కంటతడి పెట్టించింది. ఇంటర్‌ ఫస్ట్ ఇయర్ చదువుతున్న బత్తిన మౌనికను…తన అన్న కుమారస్వామి బైక్‌పై ఎగ్జామ్ సెంటర్‌ వద్దకు తీసుకెళ్తున్నాడు. పరీక్ష కేంద్రానికి సమీపంలో నేషనల్ హైవేపై వీరి వాహనాన్ని లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కుమారస్వామి స్పాట్‌లోనే మృతి చెందగా.. మౌనికకు తీవ్రగాయాలయ్యాయి. సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. చికిత్స కోసం గుంటూరు తరలించారు. కుమారస్వామి చిలకలూరిపేటలో టీ స్టాల్ నడుపుతూ.. కుటుంబానికి అండగా ఉంటున్నారు. పెద్ద దిక్కుగా ఉన్న కుమారుడి మృతితో ఆ తల్లిదండ్రులు తీవ్రంగా విలపిస్తున్నారు. తనను కంటికి రెప్పలా చూసుకుంటున్న సోదరుడు మృత్యువాత పడటంతో ఆ సోదరి విలవిలలాడిపోయింది.

నెల్లూరు జిల్లాలో కాలువలో పడి ఇద్దరు చిన్నారులు మృతి

నెల్లూరు జిల్లాలోని దీన్ దయల్ నగర్ లో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు ఇద్దరు చిన్నారులు కాలువలో పడి మృతి చెందారు. చిన్నారుల తల్లి బట్టలు ఉతికేందుకు కాలువ దగ్గరకు వెళ్ళింది. తనతో పాటు చందు, కల్పన అను ఇద్దరు చిన్నారులను కూడా వెంట తీసుకెళ్ళింది. అయితే ప్రమాదవశాత్తు ఆ ఇద్దరు చిన్నారులు కాలువలో పడి మృతి చెందారు. దీంతో వారి కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఆ తల్లి కడుపు కోతతో కన్నీరుమున్నీరుగా విలపించింది. ఈ ఘటన స్థానిక ప్రజలను కూడా కన్నీళ్లు పెట్టించింది.

Also Read: Anantapur district: యాడికి మండల కేంద్రంలో పందుల యజమానుల ఫైటింగ్‌.. స్థానికంగా రచ్చ.. రచ్చ

ఉద్యోగిని మద్యం తాగి ఆఫీసుకు వచ్చిందని జాబ్‌లో నుంచి తీసేశారు.. ఆ తర్వాత ఊహించని ట్విస్ట్