Bihar Jeep accident: బీహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. నదిలోకి దూసుకెళ్లి జీపు..10మంది గల్లంతు

|

Apr 23, 2021 | 12:29 PM

పాట్నాలోని పీపాపుల్ వద్ద 15 మంది ప్రయాణికులతో వెళుతున్న జీప్ గంగా నదిలో పడిపోయింది. 10 మంది ప్రయాణికులు గల్లంతయ్యారు.

Bihar Jeep accident: బీహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. నదిలోకి దూసుకెళ్లి జీపు..10మంది గల్లంతు
Fell Into River Ganga
Follow us on

బీహార్‌ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. 15 మందితో ప్రయాణికులతో వెళ్తున్న జీపు గంగా నదిలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 10 మంది గల్లంతయ్యారు. పాట్నా జిల్లా పీపాపుల్‌ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటన జరిగిన సమయంలో జీపులో 15 మంది ఉన్నట్లు స్థానికులు తెలిపారు. 5 మంది క్షేమంగా బయటపడగా, 10 మంది నదిలో పడిపోయారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్ని పోలీసులు, సహాయక బృందాల చేత గల్లంతైన వారికోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నారు. కాగా, ఈ ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.

Read Also..Kamada Ekadashi 2021: కామద ఏకాదశి ప్రత్యేకత ఏమిటి ? ఈరోజున పూజ చేస్తే కలిగే ఫలితాలు..