Hooch Tragedy: పండుగ పూట విషాదం.. కల్తీ మద్యం తాగి ఎనిమిది మంది మృత్యువాత..

Bihar alcohol poisonings: దేశవ్యాప్తంగా దీపావళి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా సంతోషకరమైన వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో బీహార్‌లో

Hooch Tragedy: పండుగ పూట విషాదం.. కల్తీ మద్యం తాగి ఎనిమిది మంది మృత్యువాత..
Crime News

Updated on: Nov 04, 2021 | 3:25 PM

Bihar alcohol poisonings: దేశవ్యాప్తంగా దీపావళి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా సంతోషకరమైన వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో బీహార్‌లో విషాదం నెలకొంది. బీహార్‌లోని బెట్టియాలో దీపావళి సందర్భంగా విషపూరిత మద్యం తాగి.. 8 మంది మృత్యువాతపడ్డారు. పలువురి పరిస్థితి విషమంగా ఉంది. వారిని ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా.. ఇప్పటివరకు ఐదుగురు మృతి చెందినట్లు బెట్టియా ఎస్పీ ఉపేంద్రనాథ్ వర్మ ధృవీకరించారు.

కల్తీ మద్యం లేదా మరేదైనా పదార్థాలు తాగడం వల్లే వారంతా చనిపోయినట్లు తెలిపారు. ఈ వ్యక్తులంతా మద్యం సేవించారని మృతుల బంధువులు చెప్పారని.. ఘటనా స్థలం నుంచి మద్యం సీసా, హీమోపతిక్ మందు సీసా కూడా స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులను కూడా అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. అరెస్టయిన వారిలో పంచాయతీ సమితి సభ్యుడు కూడా ఉన్నాడు.

నౌతాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దక్షిణ తెల్హువా గ్రామంలో ఈ ఘటన జరిగింది. దీపావళికి ముందు మద్యం తాగి 8 మంది చనిపోవడంతో కలకలం రేగింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. బుధవారం సాయంత్రం స్థానికులు మద్యం సేవించారు. మద్యం తాగిన కొద్దిసేపటికే వారి ఆరోగ్యం క్షీణించడం ప్రారంభించింది. దీంతో వారిని హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత ఒకరి తర్వాత ఒకరు చనిపోయినట్లు పోలీసులు తెలిపారు.

అంతకుముందు గోపాల్‌గంజ్‌లోని మహ్మద్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మహ్మద్‌పూర్ గ్రామం, బుచెయా, లోహజీరాలో బుధవారం ఆరుగురు అనుమానాస్పద స్థితిలో మరణించారు. ముందు నలుగురు వ్యక్తులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆ తర్వాత కంటిచూపు పోయిందని చెబుతున్నారు. కల్తీ మద్యమే దీనికి కారణమని.. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలిపారు. మొత్తం 8మంది మరణించినట్లు పేర్కొంటున్నారు.

Also Read:

Farmhouse Casino: ఫామ్‌హౌస్ క్యాసినో కేసులో వెలుగులోకి సంచలనాలు.. బయటపడుతున్న గుత్తా సుమన్ లీలలు..

Crime News: మచిలీపట్నంలో మహిళా కానిస్టేబుల్‌ అనుమానాస్పద మృతి.. దర్యాప్తు చేపట్టిన పోలీసులు