డ్రగ్స్‌ కేసు.. నటి సంజన గల్రాని ఇంట్లో కొనసాగుతున్న సోదాలు

| Edited By:

Sep 08, 2020 | 9:09 AM

శాండిల్‌వుడ్‌లో డ్రగ్స్ కేసు విచారణ కొనసాగుతోంది. ఇందులో ఎవరెవరికి లింకులు ఉన్నాయన్న విషయంపై సీసీబీ విచారణను వేగవంతం చేసింది

డ్రగ్స్‌ కేసు.. నటి సంజన గల్రాని ఇంట్లో కొనసాగుతున్న సోదాలు
Follow us on

Sandalwood Drugs Case: శాండిల్‌వుడ్‌లో డ్రగ్స్ కేసు విచారణ కొనసాగుతోంది. ఇందులో ఎవరెవరికి లింకులు ఉన్నాయన్న విషయంపై సీసీబీ విచారణను వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలువురి ఇళ్లలో సోదాలు జరిపిన అధికారులు, కొంతమందిని అరెస్ట్ చేశారు. తాజాగా నటి సంజన గల్రాని ఇంట్లో సోదాలు జరుగుతున్నాయి. సంజన ఈవెంట్ మేనేజర్ ప్రీతం శెట్టి ఇచ్చిన సమాచారంతో ఇందిరానగర్‌లోని ఆమె ఇంట్లో సీసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. కీలకమైన ఆధారాలు దొరికితే ఆమెను అదుపులోకి తీసుకోవడానికి రంగం సిద్ధం చేశారు.

ఇక మరోవైపు ఈ కేసులో తాజాగా డిజైనర్ మోడల్ నియాజ్‌ని సీసీబీ అధికారులు అరెస్ట్‌ చేశారు. కేరళకి చెందిన నియాజ్, నటి రాగిణితో పాటు పలువురికి డ్రగ్స్ సరఫరా చేసినట్టు అధికారులు గుర్తించారు. నియాజ్‌ పలు మలయాళ సినిమాల్లో నటించగా.. మాలీవుడ్‌లో డ్రగ్స్ సరఫరాపై కూడా వివరాలు సేకరిస్తున్నారు. కాగా నటి రాగిణిని ఐదు రోజులు పోలీసుల విచారణకు ఎసిసిఎం కోర్టు అనుమతిని ఇచ్చింది.

Read More:

వైరల్‌ వీడియో.. ఈ డ్రైవర్‌ డ్రైవింగ్ స్కిల్‌కి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే

పాటతో ప్రారంభం కానున్న ‘పుష్ప’