రైలు ప్ర‌మాద ఘ‌ట‌న బాధితుల‌కు ఎక్స్ గ్రేషియా..!

|

May 08, 2020 | 4:05 PM

ఔరంగాబాద్‌లో శుక్ర‌వారం జ‌రిగిన రైలు ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాల‌కు ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం ఎక్స్‌గ్రేషియా ప్ర‌క‌టించింది. మృతులు కుటుంబాల‌కు ఒక్కో కుటుంబానికి ..

రైలు ప్ర‌మాద ఘ‌ట‌న బాధితుల‌కు ఎక్స్ గ్రేషియా..!
Follow us on
ఔరంగాబాద్‌లో శుక్ర‌వారం జ‌రిగిన రైలు ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాల‌కు ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం ఎక్స్‌గ్రేషియా ప్ర‌క‌టించింది. మృతులు కుటుంబాల‌కు ఒక్కో కుటుంబానికి రూ.5 ల‌క్ష‌ల చొప్పున అందిస్తామ‌ని సీఎంవో కార్యాల‌యం ప్ర‌క‌టింది.
మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో తెల్లావారుజామున ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. గాఢ నిద్ర‌లో ఉన్న వ‌ల‌స కూలీల‌ను మృత్యుశ‌క‌టం మింగేసింది.  పట్టాలపై నిద్రిస్తోన్న19 మంది వలస కూలీల ప్రాణాలను వేగంగా దూసుకొచ్చిన రైలు బండి బలి తీసుకుంది. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వలస కూలీలు సొంతూరుకు వెళ్లే క్రమంలో.. రాత్రి సమయంలో పట్టాలపై నిద్రించారు. కానీ గూడ్స్ రైలు రూపంలో మృత్యువు వారిని కబళించింది. మృతుల్లో చిన్నారులు కూడా ఉండటం బాధిస్తోంది. కర్మాడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఔరంగాబాద్-జల్నా రైల్వే లైన్‌లో ఈ ప్రమాదం జరిగింది. కాగా,  19 మంది మృతుల‌ కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం. ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియాను ఇవ్వ‌నున్న‌ట్లు వెల్ల‌డించింది. ఔరంగాబాద్ రైలు ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. వారికి వీలైనంత సాయం చేస్తానని ప్రకటించారు.