AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Attempted Suicide: అనంతపురం జిల్లాలో మరో దారుణం.. ప్రేమ పేరుతో యువతిని ట్రాప్‌ చేసిన ఎస్సై

Attempted Suicide: అనంతపురం జిల్లాలో మరో దారుణ సంఘటన చోటు చేసుకుంది. రక్షించాల్సిన పోలీసుసే యువతి పాలిట శాపంగా మారాడు. ప్రేమ పేరుతో డిగ్రీ చదువుతున్న..

Attempted Suicide: అనంతపురం జిల్లాలో మరో దారుణం.. ప్రేమ పేరుతో యువతిని ట్రాప్‌ చేసిన ఎస్సై
Subhash Goud
|

Updated on: May 06, 2022 | 10:19 PM

Share

Attempted Suicide: అనంతపురం జిల్లాలో మరో దారుణ సంఘటన చోటు చేసుకుంది. రక్షించాల్సిన పోలీసుసే యువతి పాలిట శాపంగా మారాడు. ప్రేమ పేరుతో డిగ్రీ చదువుతున్న యువతిని చంద్రగిరి ఎస్సై విజయ నాయక్‌ ట్రాప్ చేశారు. పామిడి మండలం కొట్టాలపల్లి తండా కు చెందిన సరస్వతి అనే యువతిని ట్రాప్ చేశారు. సదరు యువతి తిరుపతిలో డిగ్రీ చదువుతోంది. కొన్ని రోజులుగా ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం కొసాగినట్లు తెలుస్తోంది. అయితే ఎస్సై, సరస్వతిది కూడా ఒకటే గ్రామం. యువతిని వేధిస్తుండటంతో శుక్రవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన కుటుంబీకులు వెంటనే ఆమెను అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా, ఎస్సై విజయ నాయక్ పై గతంలోనే పలు ఆరోపణలు కూడా ఉన్నాయి.

అయితే తాజాగా సరస్వతిని ట్రాప్‌ చేసినట్లు బంధువులు ఆరోపించారు. ఎస్సై వేధింపుల వల్లే తన కూతురు చనిపోయిందని పామిడి పోలీస్ స్టేషన్ వద్ద తల్లిదండ్రుల ఆందోళనకు దిగారు. దీంతో తాడిపత్రి డీఎస్పీ, పోలీసు సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఎస్సై వేధింపులపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తామని పోలీసులు హామీ ఇచ్చారని ఆమె తల్లిదండ్రులు తెలిపారు.  వేధింపులకు పాల్పడిన ఎస్సై ప్రస్తుతం తిరుపతి పోలీసు స్టేషన్‌లో పని చేస్తున్నారు. ఎస్సైని అదుపులో తీసుకుని విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి:

AP Police: విదేశీ యువతిపై అత్యాచారయత్నం కేసు.. 13 రోజుల్లోనే ట్రైల్ పూర్తి.. చరిత్ర సృష్టించిన ఏపీ పోలీస్ శాఖ

Beggar Murder: బిచ్చగాడిని హత్య చేసిన ముగ్గురు వ్యక్తులు.. కారణం ఏంటో తెలుసుకుని షాకైన పోలీసులు..!