AP Police: విదేశీ యువతిపై అత్యాచారయత్నం కేసు.. 13 రోజుల్లోనే ట్రైల్ పూర్తి.. చరిత్ర సృష్టించిన ఏపీ పోలీస్ శాఖ

లిథువేనియా(Lithuania)దేశానికి చెందిన యువతి పై జరిగిన అత్యాచారయత్నం కేసులో 13 రోజుల్లోనే ట్రైల్ పూర్తి చేసి చరిత్ర సృష్టించిన ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖ. భారతదేశ చరిత్రలో ..

AP Police: విదేశీ యువతిపై అత్యాచారయత్నం కేసు.. 13 రోజుల్లోనే ట్రైల్ పూర్తి.. చరిత్ర సృష్టించిన ఏపీ పోలీస్ శాఖ
Follow us

|

Updated on: May 06, 2022 | 9:50 PM

లిథువేనియా(Lithuania)దేశానికి చెందిన యువతి పై జరిగిన అత్యాచారయత్నం కేసులో 13 రోజుల్లోనే ట్రైల్ పూర్తి చేసి చరిత్ర సృష్టించిన ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖ. భారతదేశ చరిత్రలో ఈ కేసు ఆదర్శంగా నిలిచింది అని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు దేశంలోని రాష్ట్రాలలో ఎక్కడ కూడా ఇంత వేగవంతంగా కేసు దర్యాప్తు జరిగిన సంఘటనలు లేవు. కానీ ఈ రోజు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం, పోలీసు శాఖ నెల్లూరు జిల్లా లో విదేశీ యువతి పైన జరిగిన అత్యాచారాయత్నం కేసులో 13 రోజులలోనే కేసు ట్రైల్ ను పూర్తి చేసి దేశంలోని మిగిలిన రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. యువతి పైన జరిగిన అత్యాచారాయత్నం కేసులో పోలీసులు అత్యంత వేగంగా స్పందిచడంతో తోపాటు కేవలం 13 రోజుల్లోనే కేసు నమోదు, దర్యాప్తు, ట్రైల్ ను పూర్తి చేశాం. ఇది దేశ చరిత్రలోనే ఓక గొప్ప ఘటన అని డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. కేసు నమోదు మొదలుకొని ట్రైల్ పూర్తి జరిగే వరకు డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి గారి నిరంతర పర్యవేక్షణలో కేసు దర్యాప్తు కొనసాగింది. భాదితురాలు విదేశీయువతి కావడం తో ఒక సారి భాదితురాలు దేశం విడిచి వెళ్ళితే జరిగే పరిణామాలను కేసు దర్యాప్తు, తీవ్రతపై పడే ప్రభావాన్ని ముందుగానే అంచనా వేసి ఎప్పటిఅప్పుడు నెల్లూరు జిల్లా ఎస్పీకి ఆదేశాలు జారీ చేస్తూ ఈ కేసు దర్యాప్తు ముందుకు కొనసాగింది..

యువతి ఫిర్యాదు

నెల్లూరు జిల్లా సైదాపురం గ్రామ శివారు ప్రాంతంలోని అటవీ ప్రాంతంలో తన పైన అత్యాచారాయత్ననికి పాల్పడినట్లు మార్చి 8, 2022న ఉదయం సుమారు 11.30 గంటల ప్రాంతంలో లిథువేనియా(Lithuania)దేశానికి చెందిన యువతి సైదా పురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. యువతి ఫిర్యాదుపై ఎఫ్‌ఐ‌ఆర్ నెంబర్ 16/22 కేసు నమోదు. u/s 323, 354-A, 376, r/w 511 ఐ‌పి‌సి అండ్‌ sec 120(b) కింద కేసు నమోదు చేసి నిందితులను మూడు గంటల్లో అరెస్టు చేశారని తెలిపారు.

దిశ పోలీస్ స్టేషన్ కు కేసు బదిలీకి డి‌జి‌పి ఆదేశాలు:

నెల్లూరు జిల్లా లో విదేశీ యువతి పైన జరిగిన అత్యాచారయత్నం ఘటనపైన కేసును తక్షణమే దిశ పోలీస్ స్టేషన్ కు బదిలీ చేయడం తో పాటు కేసు దర్యాప్తును మరింత వేగంగా కొనగించడంమే కాకుండా భాదితురాలికి రక్షణ గా మేము ఉన్నామనే భరోసా కల్పించాల్సిందిగా జిల్లా ఎస్పీకి ఆదేశాలు జారీచేయడం జరిగింది. అదే విధంగా కేసులో నిర్లక్ష్యానికి ఆస్కారం లేకుండా పకడ్బందీగా సాక్ష్యాధారాలను సేకరించి నిర్ణీత గడువులోగా చార్జిషీటు దాఖలు చేయాల్సిందిగా ఎస్పీకి ఆదేశాలు జారీచేసిన డి‌జి‌పి.

సైదాపురం పోలీస్ స్టేషన్ నుండి దిశ స్టేషన్ కు కేసు బదిలీ.. ఏడు రోజుల్లోనే విచారణ పూర్తి

డీజీపీ ఆదేశాల మేరకు కేసు దర్యాప్తులో భాగంగా పూర్తి స్థాయిలో సాక్షాధారాలు సేకరించేందుకు రంగం లోకి దిగిన దిశ పోలీస్ స్టేషన్ అధికారులు సంఘటనకు ముందు అనంతరం జరిగిన పరిణామాల పై బాధితురాలి నుండి మరోసారి వివరాలు సేకరించి అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సాక్ష్యాధారాలను సేకరించి కేవలం కేసు నమోదైన నాటి నుండి వారం రోజుల నిర్ణీత గడువులోపే న్యాయస్థానంలో ఛార్జీషీట్ దాఖలు చేయడం జరిగింది.

☛ షెడ్యూల్ మేరకు కేవలం మూడురోజుల్లోనే (మార్చి 29 నుంచి ఏప్రిల్‌ 1 వరకు) న్యాయస్థానంలో విచారణను పూర్తి చేశారు నెల్లూరు జిల్లా సెషన్స్ కోర్ట్ గౌరవ న్యాయమూర్తి.

☛ మార్చి 29 నుంచి ఏప్రిల్‌ 1 వరకు పోలీసులు పూర్తి స్థాయి లో ఛార్జీషీట్‌లో దాఖలు చేసిన సాక్షులను విచారించింది జిల్లా సెషన్స్ న్యాయస్థానం.

☛ రెండు రోజుల్లో ఏప్రిల్‌ నుంచి 7 వరకు ఇరు పక్షాల వాదనలను పూర్తి.

☛ మే 5వ తేదీన ఈ కేసుపై తుది తీర్పు వెల్లడించింది కోర్టు. మనుబోలు మండలం బద్దవోలు వెంకన్నపాలేనికి చెందిన ఇంగిరాల సాయికుమార్, గూడూరు శారదనగర్‌ ప్రాంతానికి చెందిన సయ్యద్‌ మహ్మద్‌అబీద్‌లకు జీవిత కాలంలో సగభాగం జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ.15 వేలు చొప్పున జరిమానా విధిస్తూ నెల్లూరు ఎనిమిదో అదనపు జిల్లా సెషన్స్‌ కోర్టు న్యాయమూర్తి సి. సుమ గురువారం తీర్పు చెప్పారు. భారత దేశ చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, న్యాయ వ్యవస్థ, పోలీసు శాఖ సమన్వయంతో ఏకతాటిపై ముందుకు సాగుతూ ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకొని విదేశీ మహిళకు పరిపూర్ణ న్యాయం అందించడంలో బాధ్యత నిర్వహించారు.

ఇవి కూడా చదవండి:

Andhra Pradesh: ఏపీ ప్రజలకు ముఖ్య అలెర్ట్.. ఆ జిల్లాలకు పిడుగుల హెచ్చరిక.!

Andhra Pradesh: కొత్తగా పెళ్లైన జంటలకు సీఎం జగన్ గుడ్ న్యూస్.. ఇక నుంచి వారందరూ..

Latest Articles
త్వరపడండి.. బంపర్‌ ఆఫర్‌.. తక్కువ ధరల్లో 1.5 టన్‌ ఏసీలు..
త్వరపడండి.. బంపర్‌ ఆఫర్‌.. తక్కువ ధరల్లో 1.5 టన్‌ ఏసీలు..
వందేభారత్, వందే మెట్రో మధ్య తేడాలివే.. పూర్తి వివరాలు ఇవిగో..
వందేభారత్, వందే మెట్రో మధ్య తేడాలివే.. పూర్తి వివరాలు ఇవిగో..
23 ప్రధాన అంశాలతో టీ. కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల
23 ప్రధాన అంశాలతో టీ. కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల
కోహ్లీ స్ట్రైక్ రేట్‌పై ప్రశ్నలు.. 2021 సీన్ రిపీట్ చేసిన రోహిత్
కోహ్లీ స్ట్రైక్ రేట్‌పై ప్రశ్నలు.. 2021 సీన్ రిపీట్ చేసిన రోహిత్
ఖమ్మం జిల్లాలో భానుడి భగభగలు.. పెట్రోల్ బంక్‌లో కూలర్స్ ఏర్పాటు
ఖమ్మం జిల్లాలో భానుడి భగభగలు.. పెట్రోల్ బంక్‌లో కూలర్స్ ఏర్పాటు
STP అంటే ఏమిటి? ఇది ఎలా పని చేస్తుంది?
STP అంటే ఏమిటి? ఇది ఎలా పని చేస్తుంది?
అబ్బబ్బ.! ఎంతటి చల్లటి కబురు.. ఈ పోర్టబుల్ ఏసీతో ఇల్లంతా షిమ్లానే
అబ్బబ్బ.! ఎంతటి చల్లటి కబురు.. ఈ పోర్టబుల్ ఏసీతో ఇల్లంతా షిమ్లానే
డేవిడ్ వార్నర్‌ స్పెషల్ రిక్వెస్ట్.. ఓకే చెప్పిన అల్లు అర్జున్..
డేవిడ్ వార్నర్‌ స్పెషల్ రిక్వెస్ట్.. ఓకే చెప్పిన అల్లు అర్జున్..
రాయ్‌బరేలీ నుంచి రాహుల్‌ పోటీపై స్పందించిన ప్రధాని మోదీ
రాయ్‌బరేలీ నుంచి రాహుల్‌ పోటీపై స్పందించిన ప్రధాని మోదీ
బీఆర్ఎస్‌పై అవినీతి ఆరోపణలు.. ప్రధాని మోదీ వ్యాఖ్యలకు నామా కౌంటర్
బీఆర్ఎస్‌పై అవినీతి ఆరోపణలు.. ప్రధాని మోదీ వ్యాఖ్యలకు నామా కౌంటర్