CRPF Jawan Arrest: మావోయిస్టులకు ఆయుధాలు, మందుగుండు సామగ్రి సరఫరా చేస్తున్నారనే ఆరోపణలపై జార్ఖండ్‌లోని రాంచీలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) జవాన్‌తో పాటు అతని ఇద్దరు సహచరులను జార్ఖండ్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ATS) అరెస్టు చేసింది. సీపీఐ మావోయిస్ట్, ఉగ్ర గ్రూపులు, ఇతర నేరస్థులకు ఆయుధాలు, మందుగుండు సామగ్రి సరఫరా చేసినట్లు నిర్ధారణ అయిందని పోలీసులు తెలిపారు. ఈ మేరకు జమ్మూ కాశ్మీర్‌లోని పుల్వామాలో విధులు నిర్వర్తిస్తున్న సీఆర్‌పీఎఫ్ జవాన్ (182 బెటాలియన్)తో పాటు అతని ఇద్దరు సహచరులను జార్ఖండ్ ఎటిఎస్ అరెస్టు చేసినట్లు పోలీసు సూపరింటెండెంట్ ప్రశాంత్ ఆనంద్ తెలిపారు. 182 బెటాలియన్ సీఆర్‌పీఎఫ్ జవాన్ అవినాష్ కుమార్ అలియాస్ చున్ను శర్మ (29), రిషి కుమార్, పంకజ్‌కుమార్‌ను ఈ కేసులో అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఇద్దరు సాధారణ పౌరులుతో కలిసి అవినాష్ కుమార్ ఉగ్ర సంస్థలకు మందుగుండు సామగ్రిని సరఫరా చేసేవాడని ఎస్పీ తెలిపారు.
దాడుల్లో.. పోలీసు బృందం 6.56 మిమీ 450 రౌండ్ల మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకుందని ఎస్పీ తెలిపారు. ఈ దాడుల్లో ఏటీఎస్‌తోపాటు బీహార్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్‌టిఎఫ్) సహకరించిందని ఎస్పీ తెలిపారు. జవాన్‌ను అదుపులోకి తీసుకున్న అనంతరం వీరిలో ఇద్దరిని బీహార్‌లో అరెస్టు చేసినట్లు తెలిపారు. తదుపరి విచారణ కొనసాగుతుందని.. ఇంకా మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకునేందుకు ప్రత్యేక బృందం గాలిస్తోందని పోలీసులు తెలిపారు. ఇప్పటివకే వారి వద్ద నుంచి భారీగా మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తలిపారు.
2011లో సీఆర్‌పీఎఫ్‌లో చేరిన అవినాష్.. 2017 నుంచి పుల్వామాలో విధులు నిర్వహిస్తున్నాడు. అయితే గత నాలుగు నెలలుగా విధులకు దూరంగా ఉన్న అతనిపై పోలీసులు నిఘా వేసి పట్టుకున్నారు. త్వరితగతిన డబ్బు సంపాదించాలన్న నేపంతో గ్యాంగ్‌స్టర్లు, ఉగ్రసంస్థలతో సంప్రదింపులు జరిపి మందుగుండు సామగ్రి సరఫరా చేయడం ప్రారంభించారని తెలిపారు.
Also Read: