Dichpally Triple Murder: నిజామాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. బ్రతుకుదెరువు కోసం వచ్చిన వారు మృత్యువాతపడ్డారు. ముగ్గురు వ్యక్తులను గుర్తుతెలియని దుండగులు అత్యంత దారుణంగా హతమార్చారు. డిచ్‌పల్లిలో మండల కేంద్రంలోని హార్వెస్టర్ మెకానిక్ షాపులో పనిచేస్తున్న ముగ్గురు వ్యక్తులు దారుణ హత్యకు గురయ్యారు. నాగపూర్ గేట్ సమీపంలోని మెకానిక్ షాపులో నిద్రిస్తున్నవారిని గుర్తుతెలియని వ్యక్తులు గొంతుకోసి హతమార్చారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతులను పంజాబ్ రాష్ట్రానికి చెందినవారిగా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించిన పోలీసులు.. ప్రత్యేక బృందాలతో హంతకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Read Also.. Viral Video: నెట్టింట వైరల్ అవుతున్న మ్యాజిక్ షో.. రెప్పపాటులో డ్రస్సులు మార్చేస్తున్న యువతి..
AP CM YS Jagan: ‘జగనన్న సంపూర్ణ గృహ హక్కు’పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు