Mudslide: ప్రళయం.. భారీ వర్షాలతో విరిగిప‌డుతున్న కొండచ‌రియ‌లు.. 19 మంది మిస్సింగ్‌.. షాకింగ్ వీడియో

19 missing as mudslide hits: జ‌పాన్‌ను వారం నుంచి భారీ వ‌ర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. దీంతో పలు ప్రాంతాల్లో భీకర పరిస్థితులు నెలకొన్నాయి. టోక్యో స‌మీపంలో

Mudslide: ప్రళయం.. భారీ వర్షాలతో విరిగిప‌డుతున్న కొండచ‌రియ‌లు.. 19 మంది మిస్సింగ్‌.. షాకింగ్ వీడియో
Mudslide Hits In Japan

Edited By: Ravi Kiran

Updated on: Jul 03, 2021 | 3:35 PM

19 missing as mudslide hits: జ‌పాన్‌ను వారం నుంచి భారీ వ‌ర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. దీంతో పలు ప్రాంతాల్లో భీకర పరిస్థితులు నెలకొన్నాయి. టోక్యో స‌మీపంలో ఉన్న ఓ పట్టణంలో భారీగా కురిసిన వర్షాలతో.. మ‌ట్టి చ‌రియ‌లు విరిగిప‌డ్డాయి. ఈ ఘ‌ట‌న‌లో 19 మంది అదృశ్యమైన‌ట్లు జపాన్ అధికారులు వెల్లడించారు. షిజువాకా జిల్లాలో జ‌రిగిన ఈ దుర్ఘటనలో అనేకమంది మృతి చెందగా.. చాలా ఇళ్లు నేలమట్టమైనట్లు షిజుకా ప్రిఫెక్చర్ ప్రతినిధి తకామిచి సుగియామా పేర్కొన్నారు.

భారీ వర్షాలతో.. కొండ చ‌రియ‌లు భారీగా విరిగిప‌డ్డ భయంకర పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో ఈ ప్రాంతం నుంచి చాలా మంది ముందు జాగ్రత్తగా సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లి వెళుతున్నారు. కొండచ‌రియ‌లు వేగంగా దూసుకువ‌స్తున్న భయంకర వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. అయితే.. ఇంకా చాలామంది అదృశ్యమైనట్లు పలు మీడియా సంస్థలు పేర్కొంటున్నాయి.

వీడియో..

చిక్కుకున్న వారిని ర‌క్షించేందుకు రెస్క్యూ ఆప‌రేష‌న్ మొద‌లుపెట్టినట్లు అధికారులు తెలిపారు. ఉదయం అంతా ఈ ప్రాంతంలో తీవ్రంగా వర్షం పడుతోందని దీంతో సహాయక చర్యలకు విఘాతం కలుగుతోంది. ఈ సహాయక చర్యల్లో భద్రతా దళాలు, అగ్నిమాపక సిబ్బంది పాల్గొంటున్నాయి. అంతేకాకుండా ఈ ప్రాంత వాసులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

Also Read:

‘రాతి బొమ్మ’ లా మారిపోనున్న చిన్నారి.. కదలలేని స్థితికి దారి తీస్తున్న అరుదైన వ్యాధి..షాక్ తిన్న పేరెంట్స్

Crime News: బీజేపీ ఎమ్మెల్యేపై అత్యాచారం కేసు నమోదు.. పార్టీ మహిళా కార్యకర్త ఫిర్యాదు..