AP Govt on Tejaswini Case: నెల్లూరు జిల్లా గూడూరులో బీటెక్ విద్యార్థిని తేజస్విని హత్య ఉదంతంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీరియస్ అయింది. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏపీలోని వైఎస్ జగన్ ప్రభుత్వం ఆదేశాలిచ్చినట్లు తెలుస్తోంది. తేజస్వినిని హత్య చేసి.. ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసిన వెంకటేష్‌ను విచారించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. తేజస్వినిని హత్య చేసి.. తాను ఆత్మహత్య చేసుకున్నట్లు నిందింతుడు చిత్రీకరించే ప్రయత్నం చేశాడని బాధితురాలి తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. ప్రేమ పేరుతో తమ కుమార్తెను వెంకటేష్ పొట్టన పెట్టున్నాడని తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం నిందితుడు వెంకటేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే.. ఈరోజు పోలీసులు అతణ్ణి అదువులోకి తీసుకునే అవకాశం ఉంది. ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలం రికార్డు చేసిన పోలీసులు చర్యలకు సిద్ధమయ్యారు. ప్రభుత్వం కూడా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించడంతో.. అధికారులు విచారించి అసలు నిజాలను బయటకు రాబట్టేందుకు సిద్ధమవుతున్నారు.
కాగా.. యువకుడి చేతిలో హత్యకు గురైన ఇంజినీరింగ్ విద్యార్థిని తేజస్విని మృతదేహాన్ని ఏపీ మహిళా కమిషన్ అధ్యక్షురాలు వాసిరెడ్డి పద్మ శుక్రవారం సందర్శించారు. అనంతరం బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఆమె మాట్లాడుతూ.. ప్రేమ పేరుతో యువతులను వేధించి హతమార్చే ఉన్మాదులకు బతికే హక్కులేదన్నారు. ప్రేమించడం లేదన్న కోపంతో నిందితుడు వెంకటేశ్ ఆమెను హత్య చేయడం కలచివేసిందన్నారు. వీలైనంత త్వరగా నిందితుడికి శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు. వారంలోపు ఛార్జ్ షీట్ దాఖలు చేసేందుకు ప్రయత్నం చేస్తామని బాధితురాలి కుటుంబసభ్యులకు హామీనిచ్చారు. ఇదిలాఉంటే.. టీడీపీ, బీజేపీ, పలు పార్టీల నాయకులు, మహిళా సంఘాలు నిందితుడు వెంకటేష్‌కు ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నాయి.
Also Read: