టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమపై కేసు నమోదు చేసిన సీఐడీ, ఎలక్ట్రానిక్‌ డాక్యుమెంట్‌ను ఫోర్జరీ చేశారని ఆరోపణలు

|

Apr 10, 2021 | 11:16 PM

Devineni Uma cheating case : టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమపై కేసు నమోదు చేసింది సీఐడీ

టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమపై కేసు నమోదు చేసిన సీఐడీ, ఎలక్ట్రానిక్‌ డాక్యుమెంట్‌ను ఫోర్జరీ చేశారని ఆరోపణలు
Devineni Uma
Follow us on

Devineni Uma cheating case : టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమపై కేసు నమోదు చేసింది సీఐడీ. తిరుపతి బైపోల్‌ సందర్భంగా.. ఈనెల 7న దేవినేని ఉమ ప్రెస్‌ మీట్‌ నిర్వహించారు. ఆ ప్రెస్‌ మీట్‌లో ఆయన చూపించిన డిజిటల్‌ డాక్యుమెంట్‌ ఫోర్జరీ అంటూ సీఐడీ కేసు బుక్‌ చేసింది. ఓ ట్యాబ్‌లో ఆయన చూపించిన వీడియోని ఫోర్జరీ అని.. అది చూపి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా, కర్నూలు జిల్లాలో పోలీసులు భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. కోటి కాదు.. 2కోట్లు కాదు… దాదాపు 4 కోట్లు సీజ్‌ చేశారు. ఎక్కడిది.. ఎక్కడి నుంచి వస్తుందన్న దానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. అటు, తెలంగాణలో గంజాయి దందాకు చెక్‌ పెట్టారు హైదరాబాద్‌ పోలీసులు. ఈ మాఫియాలో కీలక సూత్ర దారి కిన్‌ పిన్‌ బాబు ఖాలేను అరెస్టు చేశారు. కొన్ని సంవత్సరాలుగా ఖాకీలను ముప్పు తిప్పలు పెడుతున్న ఖాలే ఎట్టకేలకు కటకటాల పాలయ్యాడు.

Read also : పోలీసులపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర విమర్శలు, వీళ్ల ఉద్యోగాలు గోవిందా.. గోవింద! అంటూ ఎద్దేవా