Andhra Pradesh: కానిస్టేబుల్‌తో భార్య అక్రమ సంబంధం.. అది తెలిసిన భర్త వీడియో తీసి..

Andhra Pradesh Crime News: కృష్ణా జిల్లా ఏ.కొండూరు మండలం కేశ్యాతండాలో వ్యక్తి ఆత్మహత్యాయత్నం తీవ్ర కలకలం సృష్టించింది. తన ఓ భార్య ఓ పోలీసు అధికారితో అక్రమ సంబంధం..

Andhra Pradesh: కానిస్టేబుల్‌తో భార్య అక్రమ సంబంధం.. అది తెలిసిన భర్త వీడియో తీసి..
Suicide

Updated on: Sep 21, 2021 | 7:17 AM

Andhra Pradesh Crime News: కృష్ణా జిల్లా ఏ.కొండూరు మండలం కేశ్యాతండాలో వ్యక్తి ఆత్మహత్యాయత్నం తీవ్ర కలకలం సృష్టించింది. తన ఓ భార్య ఓ పోలీసు అధికారితో అక్రమ సంబంధం పెట్టుకుందంటూ సెల్ఫీ వీడియో తీసి వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కేశ్యాతండాకు చెందిన ఓ వ్యక్తికి కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. అయితే, అతని భార్య అదే ప్రాంతానికి చెందిన ఓ కానిస్టేబుల్‌తో వివాహేతర సంబంధాన్ని నడుపుతోంది. ఈ విషయం తెలిసిన సదరు.. భార్యను హెచ్చరించాడు. అయినప్పటికీ ఆమెలో మార్పు రాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఈ నేపథ్యంలోనే పురుగుల మందు డబ్బాను కొనుగోలు చేసి.. నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లాడు. అక్కడ సెల్ఫీ వీడియో తీసుకుంటూ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కానిస్టేబుల్‌తో తన భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందని, తనను బెదిరింపులకు గురిచేస్తున్నారని సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు. అలా చెబుతూనే పురుగుల మందు తాగేశాడు. అయితే, ఇది గమనించిన స్థానికులు పురుగుల మందు తాగిన సదరు వ్యక్తిని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

Also read:

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్‌లో హీట్ పెంచిన ప్రియ- లహరి.. చిన్నపాటి యుద్ధమే జరిగిందిగా..

Mahant Narendra Giri: అఖిల భారతీయ అఖాడా పరిషత్ అధ్యక్షుడు మహంత్ నరేంద్ర గిరి మహరాజ్ అనుమానాస్పద మృతి..

Uma Bharti: వాళ్లున్నది మా చెప్పులు తీసేందుకే.. ఫైర్‌బ్రాండ్‌ ఉమా భారతి సంచలన వ్యాఖ్యలు.. వీడియో వైరల్