Wife Killed Husband in Chittoor District: చిత్తూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. వేదమంత్రాల సాక్షిగా ఒక్కటయ్యింది.. ఏడు అడుగులు వేసి ఏకమయ్యింది ఆ జంట మరిచారు. వారి దాంపత్యంలో చిన్నపాటి గొడవ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ఇద్దరి మధ్య తలెత్తిన స్వల్ప ఘర్షణ కారణంగా భార్య(Wife) ఏకంగా భర్త(Husband)ను హతమార్చింది. అంతేకాదు, ఆ హత్య చేసిన తర్వాత ఆ శవాన్ని తల, మొండెం వేరు చేసి మరీ వెళ్లిపోయింది భార్య. కుటుంబీకులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
పోలీసులు తెలిపిన కథనం ప్రకారం… రేణిగుంట బుగ్గ వీధిలో రవిచంద్రన్ సూరి(53) ఆయన భార్య వసుంధర నివాసముంటున్నారు. ఆ ఇద్దరు దంపతుల మధ్య గత కొంతకాలంగా విభేదాలు తలెత్తాయి. దీంతో ఇద్దరు తరుచు గొడవపడుతున్నట్లు స్థానికులు తెలిపారు. ఈ క్రమంలోనే గత రాత్రి దంపతుల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో పదునైన కత్తితో భర్త రవిచంద్రన్ గొంతు కోసి హతమార్చింది. అంతేకాదు.. మృతదేహం నుంచి తల, మొండెం వేరు చేసి వెళ్లిపోయింది. రక్తపుమడుగు పడి ఉన్న రవిచంద్రన్‌ను గమనించిన కుటుంబసభ్యులు.. పోలీసలకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న రేణిగుంట అర్బన్ పోలీసులు మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు నమోదు చేశారు. భర్తను హత్య చేసిన వసుంధరను అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Read Also… Corona Update: దేశంలో దడ పుట్టిస్తున్న కరోనా.. రికార్డు స్థాయిలో భారీగా పాజిటివ్ కేసులు.. ఎన్నంటే.!