Anantapur District: రాత్రిపూట పొలాలవైపు నుంచి వింత శబ్ధాలు.. భయంతో వెళ్లి చూసిన స్థానికులు.. షాక్

|

Sep 27, 2021 | 12:03 PM

దురాశ దు:ఖానికి చేటు. ఈ విషయం అందరికీ తెలుసు. కానీ కొందరు మాత్రం రాత్రికి రాత్రే కోటీశ్వర్లు అయిపోవాలని కలలు కంటున్నారు. కలలతో ఆగిపోవడం లేదు..

Anantapur District: రాత్రిపూట పొలాలవైపు నుంచి వింత శబ్ధాలు.. భయంతో వెళ్లి చూసిన స్థానికులు.. షాక్
Treasure Hunt
Follow us on

దురాశ దు:ఖానికి చేటు. ఈ విషయం అందరికీ తెలుసు. కానీ కొందరు మాత్రం రాత్రికి రాత్రే కోటీశ్వర్లు అయిపోవాలని కలలు కంటున్నారు. కలలతో ఆగిపోవడం లేదు… అందుకు రాంగ్ రూట్‌లో కార్యచరణ కూడా సిద్దం చేసుకుంటున్నారు. ఈ మధ్య సంపద కొల్లగొట్టడానికి చాలామంది ఫాలో అవుతోన్న షార్ట్ కట్ గుప్త నిధుల కోసం తవ్వకాలు. అవును.. ఈ మధ్య నిధుల కోసం పురాతన దేవాలయాలు, చారిత్రక ప్రాంతాలు.. ఆఖరికి స్మశానాలు కూడా వదలడం లేదు దుండగులు. తాజాగా అనంతపురం జిల్లాలో గుప్త నిధుల తవ్వకాలు కలకలం రేపాయి. యాడికి మండలం పుష్పాల-చింతలచెరువు వద్ధ గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపారు కొందరు. స్థానికులకు శబ్దాలు వినిపించడంతో వెళ్లి చూడగా.. బాగోతం వెలుగుచూసింది. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే గుప్త నిధులు తవ్వకాల కోసం నిందితులు జేసీబీ వినియోగించడం విశేషం. వెంటనే అక్కడిని చేరకున్న పోలీసులు కొందరు నిందితులను, జేసీబీని, నాలుగు బైకుల్ని స్వాధీనం చేసుకున్నారు. తాడిపత్రికి చెందిన ఐదుగురు, పుష్పాలకు చెందిన నలుగురు నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

గత నెలలో యాడికి మండలం కుందనకోటలో సుంకలమ్మ గుడి దగ్గర్లో పాత బురుజు ఉంది. అందులో గుప్తనిధుల కోసం తవ్వకాలు చేపట్టాలని భావించి ఐదుగురిని తీసుకొచ్చారు. తవ్వకాలకు కావాల్సినవి అన్నీ సెట్ చేసుకున్నారు. భూమి అడుగుభాగంలో ఉన్న వస్తువుల్ని కనిపెట్టేందుకు ఏకంగా మెటల్‌ డిటెక్టర్లను యూజ్ చేశారు. ఆ తర్వాత గ్యాంగ్‌గా ఏర్పడి తవ్వకాలు చేపట్టారు. యాడికి పోలీసులకు సమాచారం అందడంతో ముఠాను అరెస్టు చేశారు. ఇటీవల కాలంలో చిత్తూరు, అనంతపురం జిల్లాలో కొద్దిరోజులుగా గుప్త నిధుల తవ్వకాలు బాగా పెరిగిపోయాయి. గత వారం కొందర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Also Read: అనంతపురం జిల్లాలో బంగారం నిక్షేపాలు.. టన్ను మట్టి తవ్వితీస్తే 4 గ్రాముల గోల్డ్

ప్రభాస్ ట్రీట్ ఇస్తే ప్రపంచం ఫిదా అవ్వదా..! ‘ది బెస్ట్’ అంటూ కరీనా కపూర్ పోస్ట్