Flight Washroom: విమానంలో రహస్యంగా బాలికల వీడియోల చిత్రీకరణ.. పోలీసుల అదుపులో అటెండెంట్‌

మైనర్ బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించిన విమాన అటెండెంట్‌ వ్యవహారం అలస్యంగా వెలుగులోకి వచ్చింది. వాష్‌రూమ్‌కు వెళ్ళిన వారికి తెలియకుండా రహాస్య సెల్‌ఫోన్‌ ద్వారా వీడియో చిత్రీకరించినట్లు పోలీసులు నిర్ధారించారు. గత ఏడాది సెప్టెంబరులో అమెరికన్ ఎయిర్‌లైన్స్‌లో పనిచేస్తున్న ఫ్లైట్ అటెండెంట్‌ ఈ ఘాతుకానికి ఒడిగట్టు గుర్తించారు. ఎట్టకేలకు పక్కా ఆధారాలతో గురువారం అరెస్టు చేశారు పోలీసులు.

Flight Washroom: విమానంలో రహస్యంగా బాలికల వీడియోల చిత్రీకరణ.. పోలీసుల అదుపులో అటెండెంట్‌
American Airlines Washroom

Updated on: Jan 20, 2024 | 5:51 PM

మైనర్ బాలికలతో అసభ్యకరంగా ప్రవర్తించిన విమాన అటెండెంట్‌ వ్యవహారం అలస్యంగా వెలుగులోకి వచ్చింది. వాష్‌రూమ్‌కు వెళ్ళిన వారికి తెలియకుండా రహాస్య సెల్‌ఫోన్‌ ద్వారా వీడియో చిత్రీకరించినట్లు పోలీసులు నిర్ధారించారు. గత ఏడాది సెప్టెంబరులో అమెరికన్ ఎయిర్‌లైన్స్‌లో పనిచేస్తున్న ఫ్లైట్ అటెండెంట్‌ ఈ ఘాతుకానికి ఒడిగట్టు గుర్తించారు. ఎట్టకేలకు పక్కా ఆధారాలతో గురువారం అరెస్టు చేశారు పోలీసులు.

నిందితుడు నార్త్ కరోలినాలోని షార్లెట్‌కు చెందిన 37 ఏళ్ళ ఎస్టేస్ కార్టర్ థాంప్సన్ ను ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతడి అకృత్యాలు వెలుగులోకి వచ్చాయి. చాలా మంది బాలికల వీడియోలను తీసినట్లు విచారణలో తేలింది. అతను గతంలో పనిచేసిన మరో విమానంలో రెస్ట్‌రూమ్‌ను ఉపయోగించుకుని మరో నలుగురు మైనర్ మహిళా ప్రయాణీకుల రికార్డింగ్‌ చేసినట్లు తేలింది. థాంప్సన్‌పై పిల్లలపై లైంగిక వేధింపులకు ప్రయత్నించినందుకు, పిల్లల లైంగిక వేధింపుల చిత్రాలను కలిగి ఉన్నారని అభియోగాలు మోపారు. అతన్ని వర్జీనియాలోని లించ్‌బర్గ్‌లో అరెస్టు చేసిన పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.

ఈ ఘటనపై అమెరికన్ ఎయిర్‌లైన్స్ స్పందించింది. “సెప్టెంబర్ 2023లో జరిగిన సంఘటన తర్వాత నిందితుడిని వెంటనే సర్వీస్ నుండి తొలగించాం” అని ఎయిర్‌లైన్ తెలిపింది. “కస్టమర్ల భద్రత కంటే మరేమీ ముఖ్యం కాదని, విచారణలో చట్ట అమలుకు పూర్తిగా సహకరిస్తున్నాము” అని ప్రకటన పేర్కొంది. కాగా, నేరం రుజువైతే నిందితుడికి 2 లక్షల డాలర్లకు పైగా జరిమానాతో పాటు 50 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ సంఘటన సెప్టెంబర్ 2, 2023 న షార్లెట్ నుండి బోస్టన్‌కు విమానంలో జరిగింది. నార్త్‌ కరోలినా నుంచి మసాచుసెట్స్‌కు విమానం బయలుదేరింది. టేకాఫ్ అయిన కాసేపటికి ఓ బాలిక టాయిలెట్‌కు వెళుతుండడాన్ని గమనించాడు. ముందే టాయిలెట్‌లోకి వెళ్లి అందులో తన ఫోన్‌ను రహస్యంగా ఏర్పాటు చేశాడు. 4 ఏళ్ల ప్రయాణికురాలు తన సీటుకు దగ్గరగా ఉన్న టాయిలెట్‌ని ఉపయోగించడానికి వెళ్ళారు. అయితే ఫ్లైట్ అటెండెంట్ నిందితుడు థాంప్సన్ ఆమెను ఫస్ట్ క్లాస్ లావేటరీ ఖాళీగా ఉందని సూచించాడు. టాయిలెట్ లోపలికి వెళ్లగానే, టాయిలెట్ సీటు మూత కింద ఇన్‌ఆపరేటివ్ క్యాటరింగ్ ఎక్విప్‌మెంట్, “సీట్ బ్రోకెన్” అని రాసి ఉన్న ఎరుపు రంగు స్టిక్కర్‌ను యువతి గమనించింది. ఆమె స్టిక్కర్‌తో పాటు వీడియో రికార్డ్ చేయడానికి థాంప్సన్ దాచిపెట్టిన దాచిన ఐఫోన్‌ను ఫోటో తీసింది. అమ్మాయి వెళ్లిన తర్వాత, థాంప్సన్ మళ్లీ బాత్రూంలోకి ప్రవేశించాడు.

ఈ విషయాన్ని అమ్మాయి తన తల్లిదండ్రులకు తెలియజేసింది. లోపలికి వెళ్లిన బాలిక ఫోన్‌ను గమనించి దాన్ని ఫొటో తీసి తల్లిదండ్రులకు చూపించింది. అనంతరం ఆమె తండ్రి.. థాంప్సన్‌ను పట్టుకునేందుకు ప్రయత్నించగా అతడు టాయిలెట్‌లోకి వెళ్లి గడియ వేసుకొని ఫోన్‌లోని డేటాను తొలగించాడు. అప్రమత్తమైన తల్లిదండ్రులు విమాన కెప్టెన్‌కు ఈ విషయాన్ని తెలియజేశారు. విమానం ల్యాండ్‌ అయిన అనంతరం పోలీసులు ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…