అప్జల్ గంజ్ టైర్ల గోదాంలో భారీ అగ్నిప్రమాదం.. మంటలార్పుతున్న ఫైర్ సిబ్బంది

హైదరాబాద్ నగరంలోని అప్జల్‌గంజ్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ టైర్ల గోదాములో మంటలు ఎగిసిపడుతున్నాయి.

అప్జల్ గంజ్ టైర్ల గోదాంలో భారీ అగ్నిప్రమాదం..  మంటలార్పుతున్న ఫైర్ సిబ్బంది
Afzalgunj Tyres Godown Fire Accident

Updated on: Apr 07, 2021 | 1:16 PM

afzalgunj fire accidentహైదరాబాద్ నగరంలోని అప్జల్‌గంజ్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ టైర్ల గోదాములో మంటలు ఎగిసిపడుతున్నాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలార్పే ప్రయత్నం చేస్తున్నారు. దగ్గరలోనే పెట్రోల్ బంక్ ఉండటంతో స్థానికుల్లో తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. దీంతో చాదర్ ఘాట్ – అఫ్జల్‌గంజ్‌ రోడ్డులో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. దట్టమైన పొగ అలుముకుంది. పక్కనే గుడిసెలు ఉండటంతో మంటలు పెద్ద ఎత్తున చెలరేగాయని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. మూసీకి పక్కనే ఉండటంతో ఘటనా స్థలానికి చేరుకోవడానికి ఫైర్ ఇంజిన్లకు ఇబ్బందికరంగా మారింది. దాదాపు 15 ఫైర్ ఇంజిన్లు రాగా.. అతికష్టం మీద 8 ఫైర్ ఇంజిన్లు అక్కడికి చేరుకుని మంటలార్పే ప్రయత్నం చేస్తున్నాయి.

Read Also… ఛత్తీస్‌గడ్ మారణహోమానికి అసలు సూత్రధారి.. ఫ్లాన్ చేస్తే పక్కా గురి.. ఎవరీ మడవి హిడ్మా?