Ongole News: ఒంగోలుకు చెందిన వినోద్, కడపకు చెందిన వనజ హైదరాబాద్‌లో చదువుకుంటూ ప్రేమలో పడ్డారు… నాలుగేళ్లు ప్రేమలో ఉన్న ఈ జంట తమ ప్రేమ విషయాన్ని తల్లిదండ్రులకు చెబుతూ.. తాము పెళ్లి చేసుకుంటామని చెప్పారు. ఈ వివాహానికి వినోద్ తల్లిదండ్రులు ఒప్పుకోగా వనజ తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. దీంతో తాము మేజర్లు కావడంతో వనజ ఒంగోలుకు వచ్చిన వినోద్ తల్లిదండ్రుల సమక్షంలో క్రిస్టియన్ వివాహ పద్దతిలో 2020 ఆగస్టు 14న పెళ్లి చేసుకున్నారు. తమ పెళ్లిని రిజిస్టర్ చేయించుకున్నారు. వెంటనే తమకు తన తల్లిదండ్రులనుంచి ప్రాణహాని ఉందంటూ వినోద్, వనజలు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ పరిస్థితుల్లో తమ కూతురు కనిపించడం లేదంటూ వనజ తల్లిదండ్రులు కడపలో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వనజ తండ్రి ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు వనజ కోసం ఆమె తల్లిదండ్రులను వెంటబెట్టుకుని ఒంగోలుకు వచ్చారు. ఇప్పటికే తాము ఒంగోలు తాలూకా పోలీసులకు తమ ప్రేమ, పెళ్లి వ్యవహారాలను వివరించామని, తమకు వనజ తల్లిదండ్రుల నుంచి ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేశామని ప్రేమజంట కడప పోలీసులకు వివరించారు. తాము మేజర్లమని, పెళ్లి – వయస్సు ధృవీకరణ పత్రాలు చూపారు. అయితే కడపలో మిస్సింగ్ కేసు నమోదైన నేపథ్యంలో వనజ కడపకు రావాలంటూ పోలీసులు బలవంత పెట్టారు. అనంతరం యువతి తాను ఇష్ట ప్రకారమే పెళ్లి చేసుకున్నానని చెప్పడంతో అప్పటికి గొడవ సద్దు మణిగింది.
అయితే ఏడాది తర్వాత సీన్ రివర్సయింది.. కడపకు చెందిన యువతి వనజ తనతల్లిదండ్రుల దగ్గరకు చేరింది, తనను భర్త, అత్తమామలు వేధిస్తున్నారంటూ తల్లిదండ్రుల సహకారంలో కడపలో కేసు పెట్టింది, దీంతో యువకుడు వినోద్, ఆమె తల్లిదండ్రులను తీసుకెళ్లేందుకు కడప పోలీసులు ఒంగోలుకు వచ్చారు, కడప పోలీసులను చూసిన వినోద్ తల్లిదండ్రులు గేటుకు తాళాలు వేసుకుని భయంతో ఇంట్లో ఉండిపోయారు, తమను పోలీసులు పట్టుకెళ్లేందుకు వచ్చారన్న భయంతో వినోద్ తండ్రి, సోదరిలు సృహతప్పి పడిపోయారు దీంతో బంధువులు వారికి సపర్యలు చేసిన అనంతరం పోలీసులు తమ వెంట రావాలని కోరారు దీంతో తమను అన్యాయంగా పోలీసు కేసులో ఇరికిస్తున్నారని వినోద్ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు కడపకు చెందిన యువతి బంధువులు తమను పలుమార్లు కిడ్నాప్ చేసి బెదిరించినా పట్టించుకోని పోలీసులు తిరిగి తమపైనే కేసులు ఉన్నాయంటూ అరెస్ట్ చేసేందుకు వచ్చారని, తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.
Viral Photo: ఈ ఫోటోలో పులి దాగుంది.. అదెక్కడుందో గుర్తించండి.. ఈజీగా కనిపెట్టొచ్చు.!