Viral Video: అమ్మాయి మోజులో ఫీట్ చేయబోయాడు.. జస్ట్ మిస్.. తేడా వస్తే పగిలిపోయేది.. చూస్తే నవ్వాపుకోలేరు..
ఈ మధ్యకాలంలో కొంతమంది అబ్బాయిలు.. అమ్మాయిలను ఇంప్రెస్ చేసేందుకు పడరాని పాట్లు.. చేయకూడని ఫీట్లు చేస్తున్నారు. అవి సక్సెస్ అయితే పర్లేదు గానీ..
ఈ మధ్యకాలంలో కొంతమంది అబ్బాయిలు.. అమ్మాయిలను ఇంప్రెస్ చేసేందుకు పడరాని పాట్లు.. చేయకూడని ఫీట్లు చేస్తున్నారు. అవి సక్సెస్ అయితే పర్లేదు గానీ.. ఫెయిల్ అయితే మాత్రం పక్కవారికి నవ్వులే నవ్వులు. ఇక ఇలాంటి వీడియోలు తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటం మనం చూస్తూనే ఉంటాం. వాటిని చూసి నవ్వలేక మన పొట్టచెక్కలవ్వడం ఖాయం. తాజాగా ఈ కోవకు చెందిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఓ కుర్రాడు.. అమ్మాయి ముందు స్టైల్ కొట్టబోయి.. ఏం చేశాడో చూస్తే.. మీరు అస్సలు నవ్వు ఆపుకోలేరు.!
వైరల్ వీడియో ప్రకారం.. జిమ్‌లో ఓ అమ్మాయి ట్రెడ్‌మిల్‌పై వ్యాయామం చేస్తున్నట్లు మీరు చూడవచ్చు. అప్పుడే అటుగా వచ్చిన ఓ కుర్రాడు.. ఆమెను చూడమని సైగలు చేస్తూ.. స్టైల్‌గా ట్రెడ్‌మిల్‌పై ఇలా కాలు పెట్టాడో.. లేదో.. ఠక్కున బొక్కబోర్లా పడ్డాడు. ఇక దాన్ని కవర్ చేసుకునేందుకు పుషప్స్ మొదలుపెట్టాడు. మనోడి అవస్థలకు ఆ అమ్మాయి.. తన వ్యాయామాన్ని కొనసాగిస్తూనే అయ్యో.. అని అనుకుంది.
వైరల్ వీడియో:
View this post on Instagram
కాగా, ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో ‘ngakaksehat’ అనే నెటిజన్ పోస్ట్ చేయగా.. దీనిపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్, లైకులతో హోరెత్తిస్తున్నారు. ఇప్పటివరకు ఈ వీడియోకు 35 లక్షలకు పైగా లైకులు వచ్చాయి. ”జిమ్‌లో స్టైల్ కొట్టడం నిజంగా ప్రమాదకరమే” అని ఒకరు కామెంట్ చేయగా.. ”ఈ వ్యక్తి మరోసారి స్టైల్ చూపించాలనకున్నప్పుడు ఒకటికి వందసార్లు ఆలోచిస్తాడు” అని మరొకరు కామెంట్ చేశాడు. లేట్ ఎందుకు మీరు కూడా ఓసారి వీడియోపై లుక్కేయండి..