పెళ్లి అయిన 5 రోజుల తర్వాత అత్త కొడుకుతో నవవధువు జంప్.. పాపం ఆ పెళ్లికొడుకు ఇప్పటికి కూడా..

|

Mar 21, 2021 | 2:57 PM

వివాహాన్ని ఏడు జన్మల బంధంగా పరిగణిస్తారు. మ్యారేజెస్ ఆర్ మేడిన్ హెవెన్ అంటారు. కానీ ఇప్పుడు పెళ్లిళ్లు మరీ వరెస్ట్‌‌గా తయారయ్యాయి. ఆ పరిస్థితులను అద్దం పట్టే..

పెళ్లి అయిన 5 రోజుల తర్వాత అత్త కొడుకుతో నవవధువు జంప్.. పాపం ఆ పెళ్లికొడుకు ఇప్పటికి కూడా..
Bride Ran Away
Follow us on

వివాహాన్ని ఏడు జన్మల బంధంగా పరిగణిస్తారు. మ్యారేజెస్ ఆర్ మేడిన్ హెవెన్ అంటారు. కానీ ఇప్పుడు పెళ్లిళ్లు మరీ వరెస్ట్‌‌గా తయారయ్యాయి. ఆ పరిస్థితులను అద్దం పట్టే ఘటన తాజాగా బీహార్‌లోని గోపాల్‌గంజ్‌లో వెలుగుచూసింది. వివాహం అయి ఐదు రోజుల తరువాత, వధువు తన ప్రేమికుడితో పారిపోయింది. అందుతోన్న సమాచారం ప్రకారం, వధువు తన అత్త కొడుకుతో కలిసి ఎస్కేప్ అయ్యింది. ఈ ఘటన గోపాల్‌గంజ్‌లోని మంజగర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో చోటుచేసుకుంది. పారిపోయిన అమ్మాయికి తన అత్త కొడుకుతో ఎప్పుట్నుంచో సాన్నిహిత్యం ఉన్నట్లు చెబుతున్నారు. అయితే అమ్మాయి అనుమతి లేకుండా ఆమె వివాహం వేరే వ్యక్తితో నిర్ణయించడంతో, ఆమె ప్రేమించిన వ్యక్తితో కలిసి పారిపోయింది. దీని తరువాత, కుటుంబ సభ్యులు ఆమెకు నచ్చజెప్పి తిరిగి వెనక్కి తీసుకువచ్చారు. గతంలో పెళ్లి నిశ్చయించిన వ్యక్తితో వివాహం చేశారు. పెళ్లి జరిగిన 5 రోజుల తరువాత, అమ్మాయి మళ్ళీ తన అత్త కొడుకుతో కలిసి పారిపోయింది.

డిఐజి చొరవతో పోలీసుల యాక్షన్

ఈ క్రమంలో అమ్మాయి భర్త తన భార్య ఆచూకి తెలపాలని కోరుతూ పదేపదే పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కసాగాడు. అయితే పోలీసులు మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోకుండా అతడి ఫిర్యాదును లైట్ తీసుకున్నారు. ఈ క్రమంలో ఈ కేసు విషయం సరన్ డివిజన్ డిఐజి దృష్టికి వెళ్లింది. ఆయన ఆదేశాలతో పోలీసులు కేసులో కేసు నమోదు చేశారు. బాధితురాలి భర్త ఫిర్యాదు మేరకు ముగ్గురు వ్యక్తులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.

2021 ఫిబ్రవరి 22 న మంజగర్  పోలీస్ స్టేషన్ ప్రాంతానికి చెందిన ఒక అమ్మాయిని వివాహం చేసుకున్నట్లు బాధితుడు పిర్యాదులో పేర్కొన్నాడు. నిశ్చితార్థం జరిగిన రెండవ రోజు, ఆమె తన అత్త కొడుకుతో పారిపోయిందని తెలిపాడు. తరువాత ఆమెకు నచ్చజెప్పి తిరిగి తీసుకువచ్చారని, అమ్మాయి తల్లిదండ్రుల సమక్షంలో తమ పెళ్లి జరిగనట్లు వెల్లడించాడు. ఎటువంటి కట్నం కూడా తీసుకోలేదని చెప్పుకొచ్చాడు. కానీ వివాహం అయి ఐదు రోజుల తరువాత, ఆమె మళ్ళీ తన అత్త కొడుకుతో కలిసి పారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇప్పుడు అతడు తన భార్యను కనుగొని ఇంటికి తిరిగి తీసుకురావాలని పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నాడు.

Also Read: Meat shops: మంగళవారం మాంసం షాపులు మొత్తానికే బంద్.. తీవ్ర వివాదమవుతున్న మున్సిపల్‌ కార్పొరేషన్‌ నిర్ణయం

Chittoor District Corona Cases: చిత్తూరు జిల్లాలో కరోనా కల్లోలం.. వణుకు పుట్టిస్తోన్న వైరస్ వ్యాప్తి