
Disha Ravi – Toolkit Case: టూల్‌కిట్ కేసులో పర్యావరణ కార్యకర్త దిశ రవికి మరో మూడు రోజులపాటు జ్యుడీషియల్ కస్టడీని పెంచుతూ ఢిల్లీలోని మెట్రోపాలిటన్ కోర్టు శుక్రవారం ఆదేశాలు జారీచేసింది. రైతుల ఆందోళనకు సంబంధించిన టూల్‌కిట్ కుట్ర కేసులో ఇటీవల బెంగళూరుకు చెందిన పర్యావరణ కార్యకర్త దిశ రవిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అంతకుముందు ఢిల్లీ మెట్రోపాలిటన్ కోర్టు 5 రోజుల పోలీస్ కస్టడీని విధించింది. ఈ కస్టడి ముగియడంతో శుక్రవారం ఆమెను పోలీసులు న్యాయస్థానం ముందు హాజరుపర్చారు. ఈ క్రమంలో పోలీసులు ఆమె కస్టడీని పొడిగించాలని.. మరిన్ని వివరాలు సేకరించాలని కోర్టుకు తెలియజేయడంతో.. న్యాయస్థానం మరో మూడు రోజులపాటు జ్యుడీషియల్ కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలిచ్చింది.
ఇదిలాఉంటే.. భావప్రకటన స్వేచ్ఛపై దిశ రవికి స్వీడన్‌కు చెందిన పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా థన్‌బర్గ్ మద్దతు ప్రకటించారు. కాగా శనివారం దిశ రవి బెయిలుపై కోర్టు విచారణ చేపట్టనుంది.
Also Read: