KAKINADA MURDER: కాకినాడ కార్పొరేటర్ హత్య కేసులో నిందితుడు అరెస్ట్.. వెలుగులోకి వచ్చిన అసలు నిజాలు..

|

Feb 15, 2021 | 7:47 PM

KAKINADA MURDER: కాకినాడలో కార్పొరేటర్ రమేశ్‌పైకి కారు ఎక్కించి అతి దారుణంగా హత్య చేసిన నిందితుడు చిన్నాను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈనెల 12న హత్య చేసిన

KAKINADA MURDER: కాకినాడ కార్పొరేటర్ హత్య కేసులో నిందితుడు అరెస్ట్.. వెలుగులోకి వచ్చిన అసలు నిజాలు..
Follow us on

KAKINADA MURDER: కాకినాడలో కార్పొరేటర్ రమేశ్‌పైకి కారు ఎక్కించి అతి దారుణంగా హత్య చేసిన నిందితుడు చిన్నాను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈనెల 12న హత్య చేసిన సంగతి అందరికి తెలిసిందే. కాగా ఈ కేసులో పూర్వాపరాలు ఈ విధంగా ఉన్నాయి. రియల్ ఎస్టేట్ విషయంలోనే ఇద్దరి మధ్యా తలెత్తిన వివాదం హత్యకు దారి తీసినట్లు తెలుస్తోంది. తనకు నమ్మక ద్రోహం చేసి, ఆర్థిక మోసానికి పాల్పడ్డాడనే కారణంతోనే చిన్నాను రమేష్‌ దూరం పెడుతూ వస్తున్నారు. అయితే, అది నిజం కాదని, సంబంధిత విషయాలన్నీ కలిసి మాట్లాడాలని, అంతకు సుమారు వారం నుంచి చిన్నా ప్రయత్నించగా మొదట రమేష్‌ అందుకు అంగీకరించ లేదు. చిన్నా తనను కలవాలనుకుంటున్నాడనే విషయాన్ని రమేష్‌ తన స్నేహితులకు చెప్పగా వారి సలహాతోనే చిన్నాను రమేష్‌ కలిశాడు. ఈ నేపథ్యంలో ముందే అనుకున్న పథకం​ ప్రకారం రమేష్‌పైకి కారు ఎక్కించి అతి కిరాతంగా హత్య చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండుకు తరలించారు.

John Abraham : షూటింగ్‌లో గాయపడిన బాలీవుడ్‌ హీరో జాన్ అబ్రహం.. రక్తం తుడుచుకుంటున్న వీడియో వైరల్..