ఏసీబీ దాడులు: రూ. కోటి 12 లక్షల లంచంతో పట్టుబడ్డ అడిషనల్ కలెక్టర్

|

Sep 09, 2020 | 1:26 PM

తెలంగాణలో అవినీతి అధికారులపై ఏసీబీ ఉక్కుపాదం మోపుతోంది. మెదక్ జిల్లాలో చేపట్టిన సోదాల్లో మరో అవినీతి తిమింగలం ఏసీబీకి చిక్కింది. ఓ భూ వివాదంలో మెదక్ అడిషనల్ కలెక్టర్ నగేష్ రూ. కోటి 12 లక్షల లంచం తీసుకునేందుకు సిద్ధపడ్డాడు.

ఏసీబీ దాడులు: రూ. కోటి 12 లక్షల లంచంతో పట్టుబడ్డ అడిషనల్ కలెక్టర్
Follow us on

తెలంగాణలో అవినీతి అధికారులపై ఏసీబీ ఉక్కుపాదం మోపుతోంది. మెదక్ జిల్లాలో చేపట్టిన సోదాల్లో మరో అవినీతి తిమింగలం ఏసీబీకి చిక్కింది. ఓ భూ వివాదంలో మెదక్ అడిషనల్ కలెక్టర్ నగేష్ రూ. కోటి 12 లక్షల లంచం తీసుకునేందుకు సిద్ధపడ్డాడు. బాధితుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు అవినీతి అధికారిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆడియో క్లిప్ సహా అడ్డంగా దొరికిపోయారు నగేష్. ఈ క్రమంలో ఉదయం మాచవరంలోని నగేష్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఆయన నివాసంతో మరో 12 చోట్ల తనిఖీలు చేస్తున్నారు.

మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం చిప్పల్ తుర్తిలోని 112 ఎకరాలకు సంబంధించిన భూమికి ఎన్వోసీ ఇవ్వడానికి మెదక్ అడిషనల్ కలెక్టర్ నగేష్ లంచం డిమాండ్ చేశాడు. దీంతో సదరు రైతులు మూర్తితో పాటు పలువురు ఏసీబీని ఆశ్రయించారు. బుధవారం రూ.1.12 కోట్లకు సంబంధించి చెక్ తీసుకుంటూ ఏసీబీ అధికారులకు నగేష్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు.ఉదయం నుంచి మెదక్ పట్టణంలో నగేష్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేసి కీలక పాత్రలు స్వాధీనం చేసుకున్నారు.

ఎకరానికి లక్ష చొప్పున నగేష్ డిమాండ్ చేశారని, రైతు ఫిర్యాదుతో వల పన్ని పట్టుకున్నామని ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ మీడియాకు వెల్లడించారు. 12 చోట్ల నగేష్ ఆస్తులపై సోదాలు జరుగుతున్నాయని వివరించారు. నగేష్ భార్యను బోయిన్ పల్లిలోని బ్యాంక్ కు తీసుకు వెళ్లారు అధికారులు. అక్కడ లాకర్లు తెరిపించే అవకాశం ఉంది. కోటి లంచంతో ఉన్నతాధికారి దొరికి పోవడం సంచలనంగా మారింది.