Hyderabad: హైదరాబాద్‌లో బోర్డ్ తిప్పేసిన సాఫ్ట్‌వేర్ కంపెనీ.. దిక్కుతోచని స్థితిలో 800 మంది ఉద్యోగులు..
Hyderabad: నిరుద్యోగుల ఆశలను తమకు అవకాశంగా మార్చుకుంటూ అందినకాడికి దోచుకుంటున్నారు కొందరు ప్రబుద్ధులు. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను నిండా ముంచుతున్నారు. రూ. లక్షలు వసూలు చేస్తూ మోసం చేస్తున్న సంఘటనలు...
Hyderabad: నిరుద్యోగుల ఆశలను తమకు అవకాశంగా మార్చుకుంటూ అందినకాడికి దోచుకుంటున్నారు కొందరు ప్రబుద్ధులు. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను నిండా ముంచుతున్నారు. రూ. లక్షలు వసూలు చేస్తూ మోసం చేస్తున్న సంఘటనలు రోజుకోటి వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ కంపెనీ పేరుతో ఇలాంటి ఓ మోసమే హైదరాబాద్‌లో కలకలం రేపింది. దీంతో ఏకంగా 800 మంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు రోడ్డున పడ్డారు.
వివరాల్లోకి వెళితే మాదాపూర్‌లో ఇన్నోహబ్ టెక్నాలజీస్‌తో ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీని ఏర్పాటు చేశారు. ఈ సంస్థలో ఉద్యోగాల పేరుతో ఒక్కో నిరుద్యోగి నుంచి రూ. 2 లక్షలు వసూలు చేశారు. ఇలా నిరుద్యోగుల నుంచి ఏకంగా రూ. 20 కోట్లు వసూలు చేశారు. అక్కడితో ఆగకుండా రెండు నెలల పాటు శిక్షణతో పాటు జీతాలు కూడా ఇచ్చి, వర్క్ ఫ్రమ్ హోమ్ చేయించారు. ఈ క్రమంలోనే రెండు వారాల క్రితం కంపెనీకి చెందిన వెబ్‌సైట్‌లు, మెయిల్స్‌ని బ్లాక్ చేశారు. దీంతో కంగారుపడ్డ ఉద్యోగులు ఏం జరిగిందని ఆరా తీయగా సంస్థకు సంబంధించి ఎలాంటి బోర్డ్‌లు, ఉద్యోగులు లేకపోవడం మోసపోయామని తెలుసుకున్నారు. వెంటనే మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసి వారం గడుస్తోన్నా పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని సోమవారం బాధితులు మాదాపూర్ పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేపట్టడంతో ఈ విషయం బయటకు వచ్చింది.
ఈ విషయమై మాదాపూర్ సీఐ రవీంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. ఉద్యోగాల పేరుతో జరుగుతోన్న మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని నిరుద్యోగులకు సూచించారు. బ్యాక్ బోర్ ఉద్యోగాలను నమ్మొద్దని, అలా డబ్బులు ఇచ్చి ఉద్యోగం తీసుకున్నారంటే నేరస్థులను ఎంకరేజ్ చేసినట్లే అవుతుందని సీఐ పేర్కొన్నారు. ఇక ప్రస్తుతం కంపెనీకి సంబంధించి కమలేష్ కుమారి, రాహుల్ అలోక్, వైష్ణవి, ముద్ర, ప్రదీప్‌గా గుర్తించామని, వీళ్లంతా హెచ్ ఆర్, మేనేజ్‌మెంట్‌కు సంబంధించిన వాళ్లని తెలిపారు. కంపెనీ బోర్డ్ తిప్పేయడంతో సుమారు 800 మంది రోడ్డున పడ్డారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి..