Dharmavaram Child Murder: అనంతపురం జిల్లాలో దారుణం జరగింది. ధర్మవరంలో రెండున్నరేళ్ల పాపను కత్తితో కోసి హతమార్చింది కసాయి తల్లి. అనంతరం తాను కత్తితో కోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. ఈ ఘటనలో చిన్నారి అక్కడిక్కడే మృతి చెందగా.. తల్లి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. కొత్తపేటలో జరిగిన సంఘటనపై ఆరా తీస్తున్న పోలీసులు.
అనంతపురం జిల్లా ధర్మవరంలోని కొత్తపేటలో దారుణం చోటుచేసుకుంది. మీనాక్షి, శ్రీనివాసులు దంపతులు స్థానిక కొత్తపేట కాలనీలో నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. శ్రీనివాసులు చేనేత పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అయితే, దంపతుల మధ్య గత కొంతకాలంగా చిన్నపాటి గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలో శుక్రవారం భార్యా, భర్తల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వివాదం చోటుచేసుకుంది. దీంతో శ్రీనివాసులు, పెద్ద కుమార్తె తనుశ్రీ బయటకు వెళ్లారు. అదే సమయంలో మీనాక్షి.. చిన్న కుమార్తె ప్రణతి(2)ని కత్తితో దారుణంగా హత్య చేసి ఆపై ఆత్మహత్యాయత్నం చేసింది.
ఇది గమనించిన స్థానికులు వెంటనే భర్త శ్రీనివాసులుకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మీనాక్షిని చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. భార్యాభర్తల మధ్య నెలకొన్న విభేదాలతోనే ఈ ఘటన జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Read Also.. Meera Mitun: నన్ను అరెస్ట్ చేయడం కలలోనే జరుగుతుంది.. మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన హీరోయిన్..