మద్యానికి బానిసగా మారిన ఓ వ్యక్తి కట్టుకున్న భార్యను కనికరం లేకుండా కరెంటు షాక్ ఇచ్చి చంపేశాడు. దారుణమైన ఈ ఘటన ప్రకాశం జిల్లా పెద్దారవీడులో మంగళవారం జరిగింది. స్ధానిక పోలీసుల కథనం ప్రకారం.. మద్దిలకట్ట ఎస్సీ కాలనీకి చెందిన తంగిరాల యోహాన్, తోకపల్లి గ్రామానికి చెందిన శ్రావణి ఇద్దరూ భార్యభర్తలు. వీరికి 2014లో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. పెళ్లికి ముందునుంచి మద్యానికి బానిసైన యోహాను ..భార్య శ్రావణితో ప్రతిరోజు గొడవపడుతూ ఆమెన శారీరకంగా చిత్రహింసలపాలు చేయడం అలవాటుగా మార్చుకున్నాడు. ఎప్పటిలాగే సోమవారం రాత్రి ఇద్దరూ గొడవపడ్డారు. ఈనేపథ్యంలోఆమె నిద్రపోయిన తర్వాత కరెంటు తీగలు భార్య మెడకు తాకించి.. షాక్ కొట్టించి అతి దారుణంగా చంపేశాడు.
అయితే మంగళవారం ఉదయం శ్రావణి ఉరివేసుకుని చనిపోయినట్టుగా గ్రామస్తుల్ని నమ్మించి.. అక్కడినుంచి పారిపోయాడు. ఈ హత్యపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్‌కు తరలించారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడు.